Movies

మూడు పెళ్లిళ్లు చేసుకున్న అప్పటి హీరోయిన్ లక్ష్మి – ఆమె బ్యాక్ గ్రౌండ్ వామ్మో

సినీ ప్రపంచంలో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ఆ రంగుల ప్రపంచంలో ఎంట్రీ ఇచ్చాక ఎటు మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కొందరు బ్యాక్ గ్రౌండ్ ని చూసి వస్తే,మరికొందరు స్వశక్తితో ఎదిగి తామే బ్యాక్ గ్రౌండ్ గా నిలుస్తారు. ఇక ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన లక్ష్మి 15ఏళ్ళ వయస్సు నుంచి దాదాపు 400సినిమాల్లో నటించింది. అత్తగా, అమ్మగా, బామ్మగా, డిఫరెంట్ రోల్స్ లో కూడా రాణించిన లక్ష్మి ఆరోజుల్లో ఏకంగా ముగ్గురిని పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించారు. అంతేకాదు రాజకీయ రంగాన కూడా కాలు మోపింది. 1975లో జూలీ హిందీ మూవీలో నటించడం ద్వారా వెండితెరపై మెరిసిన లక్ష్మి కి ఫిలిం ఫెర్ ఉత్తమ నటి అవార్డు కూడా దక్కింది.

ఇక 1980దశకంలో హీరోయిన్ ఛాన్సెస్ రాకపోవడంతో రూటు మార్చుకుని కేరక్టర్ రోల్స్ వైపు వెళ్ళింది. అందులో కూడా విజయాలను నమోదు చేసుకుంది. ముఖ్యంగా 1998లో ఐశ్వర్యా రాయ్ డబుల్ రోల్ పోషించిన జీన్స్ మూవీలో బామ్మ పాత్రలో అద్భుత నటన కనబరిచిన లక్ష్మి,ఆతర్వాత 2004లో కరీనా కపూర్ కి బామ్మ గా హల్ చల్ మూవీలో నటించి మెప్పించింది .ఇక ఈమె తండ్రి వైవి రావు ఒకప్పుడు స్టార్ ప్రొడ్యూసర్. నెల్లూరు జిల్లాకు చెందిన ఈయన అనేక సాంఘిక ఆధారిత సినిమాలను నిర్మించారు.

ఇక లక్ష్మి తల్లి రుక్మిణి కూడా ఒకప్పుడు హీరోయిన్. తెలుగులోనే కాదు,తమిళం,మలయాళం, హిందీ ,కన్నడ భాషల్లో వందకు పైనే నటించింది. ఈమె 4సంవత్సరాల వయస్సులోనే బాలనటిగా అడుగుపెట్టి, సత్య హరిశ్చంద్ర సినిమామాలో నటించి మెప్పించింది. దాదాపు 40కి పైనే సినిమాల్లో చేసింది. ఏవిఎం వారి శ్రీవల్లీ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఇక 17ఏళ్ళ వయస్సులో లవంగి చిత్ర నిర్మాణ సమయంలో ఆ చిత్ర దర్శకుడు వైవి రావుని రుక్మిణి పెళ్లాడింది. అక్కినేని, ఎన్టీఆర్ తో కూడా కల్సి నటించింది.

రుక్మిణి హిందీలో నటించడమే కాదు,లవంగి వంటి చిత్రాలను నిర్మించింది. రుక్మిణి తల్లి లింగప్పాకం జానకి కూడా తొలితరం తమిళ నటి,నర్తకి కూడా ఇలా లక్ష్మి కుటుంబంలో మూడు తరాల నటీనటులు ఉన్నారు. ఇక లక్ష్మి వ్యక్తిగత జీవితంలోకి వస్తే,17ఏళ్ళ వయస్సులో అంటే సినిమాల్లోకి వచ్చిన కొత్తలో పెద్దలు కుదిర్చిన సంబంధంతో ఇన్స్యూరెన్స్ కంపెనీలో పనిచేసే భాస్కర్ అనే వ్యక్తితో పెళ్లయింది.

వాళ్ళీద్దిరికీ 1971లో ఐశ్వర్య పుట్టింది. ఆతర్వాత కొద్దికాలానికి విడాకులు తీసుకున్న లక్ష్మి తన సహనటుడు మోహన్ ని పెళ్లాడింది. కొంతకాలానికి అతనితో విడిపోయి,ఆతర్వాత నటుడు,దర్శకుడు శివచంద్రన్ ని పెళ్లిచేసుకుంది. అంతేకాదు కన్నడ నటుడు అనంతనాగ్ తో కూడా కొద్దికాలం సన్నిహితంగా మెలిగింది.