గీత గోవిందం సిస్టర్ కి ఎందుకంత క్రేజ్ – అసలు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి
విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమాలో హీరోకి సిస్టర్ పాత్ర పోషిచిన మౌర్యానికి ఇప్పుడు వీరలెవెల్లో క్రేజ్ వచ్చేసిందట. మంచి ఆఫర్లు వస్తున్నాయట. ఈసినిమాలో హీరోయిన్ తో సమాన నటన ప్రదర్శించే ఛాన్స్ రావడంతో ఈ అమ్మడు బానే సద్వినియోగం చేసుకుంది. ఈమె కన్నడంలో మంచి హీరోయిన్. అక్కడ ఈమె నటనకు వచ్చిన మంచి గుర్తింపు కారణంగా తెలుగులో జానకి రాముడు సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కి దారితీసింది. ఆ విధంగా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మౌర్యాని, ఆ సినిమా పెద్ద హిట్ కాకపోయినా అవకాశాలు మాత్రం వచ్చాయి.
హీరోయిన్ గా అల్ల్లరి నరేష్ ఇంట్లో దెయ్యం నాకేం భయం,అర్ధనారీశ్వర వంటి చిత్రాల్లో చేసిన ఈమెకు హీరోయిన్ గా సరైన గుర్తింపు రాలేదు. అయితే గీత గోవిందంతో చెల్లెలి పాత్ర తో మంచి గుర్తింపు రావడం విశేషం. ఇక అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముడు సెంటిమెంట్ తో గతంలో వచ్చిన సినిమాలు జనరంజకం అయ్యాయి. నటనకు కూడా మంచి ప్రాముఖ్యం ఉండేది. కానీ రానురాను అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు కేరక్టర్లు ఫ్రెండ్స్ మాదిరిగా మారిపోవడంతో పెద్దగా పండడం లేదు. అయితే గీత గోవిందం మళ్ళీ అలాంటి గుర్తింపు రావడం విశేషం.