Movies

నా బంగారు తల్లి హీరోయిన్ ఎలా అయిపోయిందో చుస్తే షాక్ అవ్వటం ఖాయం

ఒక్కొక్క హీరోయిన్ ది ఒక్కో స్టైల్. వారి పరిధుల మేరకు హద్దులు గీసుకుని మరీ నటనలో దూసుకుపోతారు. ఫలానా పాత్ర అనగానే ఫలానా హీరోయిన్ గుర్తొచ్చేలా ఉంటుంది. అయితే అంజనీ పాఠ్ అనే హీరోయిన్ ఇప్పుడు రూటు మార్చుకుని అందరినీ షాకింగ్ కి గురిచేసింది. హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్ అవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆమె ఈమేనా అనేంతగా మారిపోయింది. ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే,నా బంగారు తల్లి సినిమా చూస్తే నటిగా ఆమె నటన గుర్తొచ్చి ఓహో ఆమేనా అంటారు గానే పేరుచెబితే పెద్దగా గుర్తుండదు.
నిజానికి 14ఏళ్ళ ప్రాయం నుంచే నటించడం మొదలు పెట్టిన అంజనీ,18సినిమాల్లో నటించింది.

మరాఠీకి చెందిన ఈమె నా బంగారు తల్లి సినిమాలో నటనకు నంది బహుమతి పొందింది. అంతేకాదు ఫిలిం ఫెర్ అవార్డు దక్కింది. అంతకు ముందు తెలుగులో ప్రత్యాయం అనే సినిమా చేసినా,అది పెద్దగా పేరురాలేదు. అనే విత్ యు విత్ అవుట్ అనే శ్రీలంకన్ సినిమాకు ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెర్ ఆఫ్ ఇండియా నుంచి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు గెలుచుకుంది. ఇలాంటి అవార్డు అందుకున్న అతి చిన్న వయస్సు నటిగా రికార్డు క్రియేట్ చేసింది.

అలాగే ఇదే సినిమాకు సారీసవ్య అవార్డ్స్ వారినుంచి అంజనీ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు , కొలొంబో నుంచి ప్రెసిడెన్షియల్ అవార్డు గా బెస్ట్ అవార్డు అందుకుంది. చేసిన సినిమాలు తక్కువే కావచ్చు కానీ వరల్డ్ లెవెల్లో పేరు కొట్టేసింది. ఇక నా బంగారు తల్లి సినిమా ద్వారా ఆమెలోని నటిని తెలుగు ఆడియన్స్ కి పరిచయం చేసింది. ఆతర్వాత కాలా సినిమాలో భారతి పాత్రలో తెలుగువారికి మరోసారి చేరువైంది. 30 సంవత్సరాల ఈ భామ సమాజానికి ఉపాయాగపడే పాత్రల్లో ఒదిగిపోయింది.

రేపిస్ట్ లకు వ్యతిరేకంగా కిల్ ద రేపిస్ట్ సినిమాలో నటించిన ఈమె మొదట్లో ఎక్స్ పోజింగ్ కి మొదట్లో నో చెప్పినా ఇప్పుడు ఏ పాత్ర అయినా రేడే అంటోంది. ఈమేరకు హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. నా బంగారు తల్లి మూవీలో లంగా ఓణిలో ఆకట్టుకున్న అంజనీ ఇప్పుడు హాట్ ఫొటోస్ తో పెచ్చెక్కిస్తోంది.