అలనాటి నటి చంద్రకళ కట్టుబాట్లకు వ్యతిరేకంగా పనిచేశారా? నమ్మలేని నిజాలు
అలనాటి స్టార్ హీరోయిన్స్ లో చంద్రకళ ఒకరు. ఈమె 1967లో ఆడపడచు చిత్రం ద్వారా తెలుగు లో చెల్లి పాత్రలో నటించి, ఆడియన్స్ ని మెప్పించింది. ఆ చిత్రంలో ఈమె ఆ తర్వాత జైజవాన్,ఆత్మీయులు మూవీస్ లో అక్కినేని సోదరిగా నటించారు. ఇక తెలుగులో సూపర్ హిట్ అయిన మూగమనసులు చిత్రంలో జమున పాత్రను తమిళంలో ప్రాప్తం గా వచ్చిన ఈ మూవీలో చంద్రకళ నటించారు. మహానటి సావిత్రి దర్శక నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఆతర్వాత మాతృదేవత, తల్లా పెళ్ళామా,ఇనస్పెక్టర్ భార్య,పుట్టినిల్లు మెట్టినిల్లు,ఇద్దరూ ఇద్దరే,పసి హృదయాలు,పసిడి హృదయాలు,కోడెనాగు,వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు.
చంద్రకళ సొంతఊరు మంగుళూరు. తండ్రి ఎం.ఎస్. నాయక్. ఈయన విశాఖలో ఓ హోటల్ కి అధిపతి గా ఉండేవారు. అందుకే చంద్రకళ బాల్యం అక్కడే గడిచింది. మూడేళ్ల వయస్సులో నటరాజ రామకృష్ణ దగ్గర శిక్షణ పొందిన చంద్రకళ కు నాట్యంపై మక్కువను గమనించిన ఆమె తండ్రి మద్రాసు పంపించి ప్రముఖ నర్తకి టి బాల సరస్వతి దగ్గర చేర్పించారు. ఆవిధంగా భరతనాట్యంలో చంద్రకళ శిక్షణ పొందింది. అక్కడే విద్యోదయలో చదువుకుంది. ఇక 10ఏళ్ళ ప్రాయంలో ఘనంగా అరంగేట్రం కూడా చేసింది.
ఈమె నాట్యానికి బాల సరస్వతి పాటలు పాడేవారు. చంద్రకళ తండ్రి 1958లో నిర్మించిన శ్రీరామాంజనేయ యుద్ధంలో యయాతి కుమార్తెగా రామకథను నృత్యం చేసింది. 1961లో హిందీ చిత్రం షోలా ఔర్ షబ్నమ్ లో నటించిన చంద్రకళ యుక్తవయస్సు వచ్చాక జైలు గూడు, వందే హుబ్లీ బాలియా వంటి కన్నడ చిత్రాల్లో నటించారు. ఆతర్వాత ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించిన ఈమె ప్రముఖ డైరెక్టర్ కె ప్రత్యగాత్మ దర్శకత్వంలో రాచకొండ విశ్వనాధ శాస్త్రి మాటలు రాసిన స్త్రీ చిత్రంలో తల్లీ కూతుళ్లుగా ద్విపాత్రాభినయం చేసింది.
ఇక బాపు తీసిన సంపూర్ణ రామాయణంలో సీత నటించిన చంద్రకళ ప్రేక్షక హృదయాల్లో నిలిచిపోయింది. ఇక ఈమె సినిమాల్లో ఉండగానే అనేక నాట్య ప్రదర్శనలు ఇవ్వగా ,ఈమె చెల్లెలు నట్టువాంగం చేసేవారు. 1981లో ఎం ఏ గతాల అనే మహ్మద్ ని పెళ్లాడారు. ఈవిధంగా సినిమాల్లో ఓ ముస్లిం ని పెళ్లి చేసుకున్న అందాల తారగా నిలిచింది.
వీళ్ళ కూతురు రేష్మ గతాల ప్రస్తుతం సినిమాల్లో కథా రచయిత్రిగా రాణిస్తోంది. గౌతమ్ మీనన్, ఏటో వెళ్ళిపోయింది మనసు,బాహుబలి వంటి చిత్రాలకు కూడా ఈమె పనిచేసింది. కాగా తమిళనాడు ఉమెన్స్ హాకీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేసిన చంద్రకళ 1999జూన్ 21న కాన్సర్ వ్యాధితో మరణించారు.