ఒకప్పటి ఈ స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా … ఇప్పుడు ఏమి చేస్తుందో… ఎక్కడ ఉందో తెలుసా?
చేసినవి తక్కువ సినిమాలు అయినా జీవితాంతం గుర్తుండిపోతారు. ప్రజల మదిలో ఎప్పటికీ నిలిచేవుంటారు. అలాంటి స్టార్ హీరోయిన్స్ లో చెప్పుకోతగ్గ నటి తాళ్ళూరి రామేశ్వరి. తెలుగునాట పుట్టి తన నటనతో ఓ ఊపు ఊపేసిన ఈమె తన అందం,అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఒకప్పుడు బాలీవుడ్ ని టాలీవుడ్ ని ఏలింది. ఇంకా చెప్పాలంటే 16అణాల ఈ తెలుగు ఆడపడుచు నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగి,అక్కడే 9వ తరగతి వరకూ చదివింది. బాలీవుడ్ లో సెటిల్ అవ్వడం విశేషం.
రామేశ్వరి చదువుకునే రోజుల్లో ఆమె తండ్రి ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఈమె కుటుంబం తిరుపతి వెళ్ళింది. నటనపట్ల ఆసక్తితో తండ్రి ప్రోత్సాహంతో నటనలో ఈమె ట్రైనింగ్ అయింది. రాజశ్రీ ఫిలిమ్స్ వారు కొత్తవాళ్లతో సినిమా తీయాలని వెతుకుతుంటే, అందులో ఓ పాత్రకోసం ప్రయత్నిస్తే, ఏకంగా రామేశ్వరి హీరోయిన్ గా ఎంపికైంది. అలా 1977లో బాలీవుడ్ లో తీసిన జులహన్ వహి జోపియు భాయి హిందీ సినిమాతో కెరీర్ మొదలు పెట్టింది.
ఆ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న రామేశ్వరి ఆ మరుసటి సంవత్సరం తెలుగులో సీతామాలక్ష్మి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. కళాతపస్వి కె విశ్వనాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ లో ఈమె నటన తెలుగువారి హృదయాలను తడిమింది. ఈ హృదయం మంచి విజయాన్ని సాధించడంతో పాటు ఈమె నటనకు ప్రభుత్వం పురస్కారం కూడా అందించి సత్కరించింది. ఆతర్వాత మంగళ తోరణాలు అనే మూవీలో నటించినా, తెలుగు కన్నా హిందీలోనే ఆమె ఎక్కువ సినిమాల్లో నటించి అక్కడే సెటిల్ అయ్యారు.
హిందీలో స్టార్ హీరోయిన్ గా నటిస్తున్న సమయంలోనే పంజాబీ నటుడు, ప్రొడ్యూసర్ దీపక్ సేన్ తో లవ్ లో పడిన రామేశ్వరి ఆతర్వాత పెళ్లిచేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబంతో ఆనందంగా జీవిస్తూ,ఛాన్స్ వస్తే సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుతోంది. ఇక చాలా విరామం తరువాత తేజ డైరెక్షన్ లో వచ్చిన నిజం సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లిగా రామేశ్వరి నటించి మంచి మార్కులు కొట్టేసింది.