టాలీవుడ్ స్టార్లకు రెడ్డి వైఫ్‌లు
ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోల కులాలను బట్టి సినిమాలు ఆడుతున్నాయి. వాటికి తగ్గట్లే ఫ్యాన్స్ కూడా ఎక్కువభాగం సదరు సామాజిక వర్గానికి చెందినవారే ఉంటారు. కానీ పెళ్లి అనే సాంప్రదాయం వచ్చేసరికి కులాల మధ్య అంతరాలు తొలగిపోతున్నాయి. వారు నాయుడు, కాపు సామాజిక వర్గం అయినా…. వచ్చే భార్యలు మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే ఉంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రేమ పెళ్ళిళ్ళు కూడా అధికంగా ఉన్నాయి. స్టార్ హీరోల భార్యలు అందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే కావడం యాదృచ్చికం.
మొదటిసారిగా మంచువారి ఇంట చూసుకుంటే మోహన్‌బాబు కొడుకు హీరో విష్ణు… వైఎస్ సోదరుడి కుమార్తె వెరోనికా రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కవలపిల్లలు పుట్టారు. ఆ తరువాత అల్లు వారసుడు అల్లు అర్జున్ కూడా స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూడా ఇప్పుడు ఒక బాబు పుట్టాడు.. మరొకరు త్వరలో రానున్నారు.
ఇక బన్నీ మేనమామ మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్‌చరణ్ కూడా అపోలో హాస్పెటల్ చైర్మెన్ ప్రతాప్ రెడ్డి మనుమరాలు ఉపాసన రెడ్డిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. ఇద్దరూ కూడా ఎవరి లైఫ్ లో వారు బిజీ అయిపోయారు. ఆ తరువాత మంచువారింటిలోనే మరో రెడ్డి కోడలు వచ్చి చేరింది.
మంచు మనోజ్ కూడా వదిన వెరోనికా రెడ్డి స్నేహితురాలు ప్రణతిరెడ్డిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు.ఇదే కుటుంభంలో మరో ఆదర్శ వివాహం కూడా మొదట జరిగింది. అదే మంచు లక్ష్మి ప్రసన్న భర్త ‘అండీ’ బ్రామ్మనుడు కావడం విశేషం.