Kitchen

దసరా స్పెషల్ – గులాబ్ జామూన్

కావలసిన పదార్ధాలు

గులాబ్ జామూన్ మిక్స్ – ఒక కప్పు
పంచదార – రెండు కప్పులు
నీళ్లు – ఒక కప్పు
నెయ్యి లేదా నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
యాలకుల పొడి – ఒక టీ స్పూన్
నిమ్మరసం – కొద్దిగా

తయారు చేసే విధానం:
ముందుగా ఇన్‌స్టాంట్ గులాబ్ జామూన్ మిక్స్‌లో కొద్దిగా నీళ్లు పోసి, చపాతి పిండి మిశ్రమంలా గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో కానీ లేదా నేతిలో కానీ డీప్ ఫ్రై చేసుకోవాలి.

ఈ లోపుగా గులాబ్ జామూన్ తయారు చేయడాని కంటే ముందు, ఓ గిన్నెలో రెండు కప్పుల పంచదార, ఒక కప్పు నీళ్లు పోసి స్టవ్‌పై మరిగించుకోవాలి. ఈ మిశ్రమం నురగలు వచ్చి పొంగకుండా ఉండాలంటే, ఇందులో కొంచెం నిమ్మసరం పిండాలి. ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని కూడా ఇందులో కలపాలి.

కాస్త ముదురు పాకం వచ్చే వరకూ దీనిని మరిగించాలి. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న గులాబ్ జామూన్‌లను ఈ పంచదార పాకంలో పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన, జ్యూసీగా ఉండే గులాబ్ జామూన్స్ రెడీ..!