సవ్యసాచి సెన్సార్ టాక్… మరో హిట్ నాగ చైతన్య ఖాతాలో పడినట్టేనా? నాగ్ ఫుల్ ఖుషి
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచిసెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది . చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి యు /ఎ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బోర్డ్ మెంబర్స్ . యాక్షన్ తో పాటుగా ఎంటర్ టైన్ మెంట్ , సెంటిమెంట్ కలగలిపి ఉన్న సినిమా కావడంతో తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని అంటున్నారు సినిమా చూసిన వాళ్ళు . సెన్సార్ టాక్ ప్రకారం సవ్యసాచి హిట్ అవ్వడం ఖాయమట . నాగచైతన్య నటన ఈ సినిమాకు హైలెట్ అని అలాగే విలక్షణ నటుడు మాధవన్ నటనతో ఈ సినిమా మరో లెవల్ కి వెళ్లిందని మొత్తానికి నాగచైతన్య కు సాలిడ్ హిట్ అందించే చిత్రం ఈ సవ్యసాచి అని అంటున్నారు .
నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ నటించగా ఎడమ చేతి వాటం ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందట . యాక్షన్ హీరోగా సక్సెస్ కొట్టాలని , సక్సెస్ అవ్వాలని నాగచైతన్య ఎప్పటి నుండో కోరుకుంటున్నాడు ఆ కోరిక ఈ చిత్రంతో నేరేవేరెలా కనిపిస్తోందట.
నవంబర్ 2 న సవ్యసాచి చిత్రం విడుదల కానుంది . మరో సినిమా ఏది చైతూ కి పోటీగా లేకపోవడం కూడా చాలా వరకు కలిసి వస్తుంది దాంతో మంచి హిట్ కొట్టినట్లే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు .