Movies

సినీ ప్రస్థానంలో 60 ఏళ్ళు దాటినప్పటికీ చంద్రమోహన్ కి ఆ గౌరవం దక్కలేదు… ఏమిటో చూడండి

సన్నగా,రివటలా ఉండే ఈ నటుడి పక్కన నటిస్తే,తారాపధంలో దూసుకుపోతామనే నమ్మకం హీరోయిన్స్ కి ఉండేది. శ్రీదేవి, జయప్రద,జయసుధ, తాళ్ళూరి రామేశ్వరి,మంజుల,రాధికా,విజయశాంతి ఇలా ఎందరో హీరోయిన్స్ స్టార్ హీరోయిన్స్ అయ్యారంటే అందుకు ఈ హీరో పక్కన నటించడమే కారణం. ఒక గుప్పెడు హైట్ ఉండే తెలుగు పరిశ్రమను ఎలేసేవాడు అని ఆరోజుల్లో అందరూ అనేవారు. అతనే లక్కీ స్టార్ చంద్రమోహన్. 1966లో రంగుల రాట్నం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన చంద్రమోహన్ హీరోగా, కమెడియన్ హీరోగా, కేరక్టర్ ఆర్టిస్టుగా తనకు తానె సాటి అనిపించుకున్నారు. చంద్రమోహన్ 60ఏళ్లకు పైగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నా, అందుకు తగ్గ గౌరవం మాత్రం ఆయనకు దక్కలేదు. సినిమా ఇండస్ట్రీ కొందరి చేతుల్లోనే ఉండిపోవడం,పైరవీలు చేస్తేనే గుర్తింపు రావడం పరిపాటి అయింది.

అందుకే చంద్రమోహన్ లాంటి నిజమైన కళాకారునికి తగిన గుర్తింపు లభించడం లేదు.కళలకు ఎల్లలు, కళాకారునికి హద్దులు లేవని అంటారు కానీ,నిజమైన కళాకారునికి వివక్షత తప్పడంలేదు. కళాకారులు కూడా దోపిడీకి గురవుతున్నారు. అయితే గుర్తింపు కన్నా రాణింపు ప్రధానమని నమ్మి నటుడిగా తన ప్రస్థానాన్ని చంద్రమోహన్ కొనసాగిస్తున్నారు. చూడగానే ఆకట్టుకునే రూపం ఉండడంతో చాలా తక్కువ సమయంలో అందరికీ చేరువయ్యాడు.

1947సెప్టెంబర్ 15న కృష్ణా జిల్లాలో జన్మించారు. దర్శకుడు కె విశ్వనాధ్ ఆయనకు దూరపు బంధువు. విశ్వనాధ్ చొరవతో ఇండస్ట్రీకి వచ్చినా, ఆతర్వాత సొంత ప్రతిభతో నిలదొక్కుకున్నారు. మొదట్లో సహాయ పాత్రలతో సరిపెట్టుకున్నా, ఆతర్వాత ప్రధాన పాత్రలకు వచ్చాడు. దాంతో లక్కీస్టార్ గా మారిపోయాడు. ఆసమయంలో ఇండస్ట్రీకి వచ్చే హీరోయిన్స్ ఒక్కసారి ఆయన పక్కన నటిస్తే చేయాలనుకునేవారు. సిరిసిరిమువ్వతో జయప్రద,16ఏళ్ళ వయస్సుతో శ్రీదేవి అలానే స్టార్ హీరోయిన్స్ అయ్యారు.

చంద్రమోహన్ హైట్ మైనస్ గా మారినా, నటుడిగా ఎవరికీ తీసిపోనంత ఎత్తుకు ఎదిగాడు. హీరోయిన్స్ పాలిట లక్కీస్టార్ గా మారిన ఘనత తెలుగు సినీ చరిత్రలో మరెవ్వరికీ లేదు. పాత్రకు ఆహార్యం,వాచకం పై స్పష్టమైన అవగాహన ఉన్నందున చంద్రమోహన్ అద్భుత అభినయం చూపించాడని దర్శకుడు రేలంగి నరసింహారావు అనేవారు. వీరిద్దరి కాంబినేషన్ లో 25సినిమాలవరకూ వచ్చాయి. నిజానికి కామెడీ హీరోగా మారిన చంద్రమోహన్ సినిమాతోనే రేలంగి నరసింహారావు డైరెక్టర్ గా పరిచయం అయ్యారు.

హీరోగా, కామెడీ హీరోగా రాణించి , కారెక్టర్ ఆర్టిస్టుగా తనకు తానె సాటి అనిపించుకున్న చంద్రమోహన్ ప్రతిభకు తగిన గుర్తింపు దక్కలేదు. మరో రెండేళ్లలో చంద్రమోహన్ పరిశ్రమకు వచ్చి 60ఏళ్ళు దాటుతుంది. మరి ప్రభుత్వం, సినీ పరిశ్రమ స్పందించి ఈ డిఫరెంట్ లక్కీస్టార్ కి తగిన గుర్తింపు ఇవ్వాలని అందరూ అనేమాట.