కమెడియన్ గీతా సింగ్ పెళ్లేందుకు చేసుకోలేదో తెలిస్తే అయ్యో పాపం అనకుండా ఉండలేరు
వెండితెరపై మనల్ని తమ హాస్యంతో కడుపుబ్బా నవ్విస్తుంటారు హాస్యనటులు. కానీ అందరినీ నవ్వించే హాస్యనటులు నిజ జీవితంలో బంధాలకు,సెంటిమెంట్లకు దాసోహం అయిపోతారు. త్యాగాలకు సిద్ధం అయిపోతారు. అలాంటి వారిలో కమెడియన్ గీతా సింగ్ ఒకరు. ఈమె జీవితంలోకి తొంగి చూస్తే,ఈవీవీ సత్యనారాయణ సినిమాతో గీతా సింగ్ వెండితెరపై మెరిసి, పాపులర్ అయింది. ఈవీవీ చనిపోయాక ఆస్థాయిలో ఛాన్స్ లు దక్కలేదు. ఏదో అక్కడక్కడా తళుక్కున మెరిసి వెళ్లిపోవడం తప్ప పెద్దగా రోల్స్ ఏమీ ఈమెకు రాలేదనే చెప్పాలి. అయితే ఈమె పెళ్లి కూడా చేసుకోలేదు. అందుకు కారణం తెలిస్తే,అయ్యో అనకుండా ఉండలేం.
మా అన్నయ్యకు ఇద్దరు మగ పిల్లలు. అన్నయ్య చనిపోవడంతో వారి పెంపకం బాధ్యత నాపై పడింది. ఇక వాళ్ళ చదువుకి సంబంధించి నటుడు మోహన్ బాబు నుంచి సాయం లభిస్తోంది. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే, నా భర్త ఈ పిల్లలను వదిలెయ్యమంటాడు. మనకు పుట్టే పిల్లల్ని చూసుకుందాం అంటాడు. అప్పుడు నేనేం చేయాలి. వాళ్ళ జీవితాలు ఏమి కావాలి. అందుకే ఒంటరిగా ఉండిపోయాను. పిల్లల బాగోగులు ముఖ్యంగా భావించాను. పెళ్లి అనే మాటకు దూరం అయ్యాను.
వాళ్ళకోసమే నేను పెళ్లి చేసుకోలేదు. ఒకవేళ నా విషయంలో ఇలా జరిగితే నా పిల్లలను కూడా మా అన్నయ్య ఇలాగే చూసుకునేవాడని గట్టిగా చెప్పగలను. అందుకే నేను ఆ పిల్లలే ఎక్కువనుకున్నాను. పెళ్లి ఊసు ఎత్తలేదు’అని గీతా సింగ్ ఓ ఇంటర్యూలో కన్నీటి పర్యంతమయ్యారు. దటీజ్ గీతాసింగ్.