అలనాటి నటుడు శ్రీధర్ గుర్తు ఉన్నాడా… సినిమాలకు దూరంగా రియల్ ఎస్టేట్ కి వెళ్ళితే ఏమయిందో తెలుసా?
సినిమా ఫీల్డ్ చాలా విచిత్రమైన రంగం. కొందరిని అందలం ఎక్కిస్తే, మరికొందరిని అసలు గుర్తింపు లేకుండా చేస్తుంది. అలా గుర్తింపు లేకుండా ఉండేవాళ్ళలో ముత్యాల ముగ్గు శ్రీధర్ ఒకడు. ఆ సినిమా మంచి హిట్ కొట్టిన్నప్పటికీ, ఆతర్వాత ఛాన్స్ లు రాలేదు. రియల్ ఎస్టేట్ రంగంలో దిగినా అక్కడా నష్టాలు తప్పలేదు. నిజంగా దురదృష్టం అంటే శ్రీధర్ ని చూస్తే అర్ధం అవుతుంది. ఇంతకీ శ్రీధర్ కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలోని కుంబమూరు గ్రామంలో 1939డిసెంబర్ 21న ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. మచిలీ పట్నంలో ఇంటర్ పూర్తిచేసి,1964లో హైదరాబాద్ వచ్చి,ప్రభుత్వ పనుల శాఖలో గుమస్తా ఉద్యోగం స్టార్ట్ చేసాడు.
ఉద్యొగం చేస్తూనే సాయం కళాశాలకు వెళ్తూ బి ఏ కూడా పూర్తిచేసాడు. కళాశాల సాంస్కృతిక విభాగంలో చురుగ్గా పనిచేస్తూ,కార్యదర్శి అయ్యాడు.
పరీక్ష,చీకటి తెరలు,అభాగ్యులు,సాలెగూడు,మండే కొండలు వంటి నాటకాల్లో శ్రీధర్ కీలకపాత్రలు వేసాడు. మంచుతెర నాటకానికి ఆంధ్ర నాటక కళాపరిషత్ నుంచి ద్వితీయ బహమతి అందుకున్నాడు.
ఎన్టీఆర్ నటించిన తల్లా పెళ్ళామా చిత్రంలో తెలుగు జాతి మనది పాటలో విద్యార్థిగా తెరంగేట్రం చేసాడు. ఇక కృష్ణ నటించిన సినిమాల్లో శ్రీధర్ కనిపించేవాడు. జస్టిస్ చౌదరి సినిమాలో ఎన్టీఆర్ కొడుకుగా నటించాడు. సహజంగా నటనపట్ల మక్కువ, ప్రతిభ గల శ్రీధర్ ఏనాడూ వేషాలకోసం పాకులాడలేదు. ఛాన్స్ వస్తే వదలకుండా నటించాడు.
నటుడిగా ఉండగానే రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టాడు. ఇక చివరి దశలో టివి సీరియల్స్ వెతుక్కుంటూ వచ్చినా, నటించలేదు. సొంత చిత్ర నిర్మాణాలు చేయలేదు.ఇక ఎన్టీఆర్ నటించిన శ్రీరామ పట్టాభిషేకంలో గుహుడు పాత్ర వేయడానికి,డ్రైవర్ రాముడు సినిమాలో సెకండ్ హీరో వేషం ఆఫర్ ఇచ్చారు. ఇలా రెండింటిలోనూ నటించినప్పటికీ శ్రీధర్ కి రావలసిన గుర్తింపు మాత్రం రాలేదు. కేవలం సపోర్టింగ్ యాక్టర్ గానే మిగిలిపోయాడు.
ఇక మురళీమోహన్ తదితరుల మాదిరిగా రియల్ ఎస్టేట్ రంగంలో దిగి పెట్టుబడులు పెట్టారు. అయితే మురళీమోహన్ కి ప్రభుత్వ పరంగా లీకులు అందడంతో ఎక్కడ కొనాలో అక్కడ కొని అమ్మకాలు చేసి, లాభాలు గడిస్తే, ఈ కిటుకులు తెలియని శ్రీధర్ అంతకంటే ముందే పెట్టుబడులు పెట్టినప్పటికీ కల్సి రాలేదు. నష్టాలతో దెబ్బతిన్నాడు. ప్రభాకర రెడ్డి,గిరిబాబు,సారధి,లతో ఎక్కువగా గడిపేవాడు శ్రీధర్. మొత్తానికి ముత్యాల ముగ్గు లాంటి చిత్రం లో నటించినప్పటికీ శ్రీధర్ కి పెద్దగా గుర్తింపు రాలేదు. దురదృష్టవంతులను బాగుచేయలేం,అదృష్ట వంతులను పాడుచేయలేం అని అందుకే అన్నారేమో.