ఈ ఫోటోలో టాలీవుడ్ లెజెండ్స్ ఎవరు ఉన్నారో గుర్తు పట్టారా?
ఆ ఇద్దరు స్టార్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్లలాంటి వారు. తెలుగు సినిమా ఖ్యాతిని దేశం దశదిశలా చాటిన మహా నటులు. ఆ ఇద్దరు ఎంతో మంది నటీనటులకు ఆదర్శం. వారు మరెవరో కాదు…. ఎన్టీఆర్, ఏఎన్ఆర్. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువ గౌరవం పొందే మొదటి వ్యక్తి ఎవరు అంటే సినిమా నిర్మాత అని చెప్పేవారు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదనే చెప్పాలి. హీరో ముందు, దర్శకుడి ముందు నిర్మాతలు చేతులు కట్టుకుని నిలుచునే పరిస్థితులు కూడా అప్పుడప్పుడు ఇండస్ట్రీలో కనిపిస్తుంటాయి.
అయితే ఏఎన్ఆర్, ఎన్టీఆర్ కాలంలో పరిస్థితి వేరు. వారు నిర్మాతలకు ఎంత గౌరవం ఇచ్చేవారో చెప్పడానికి ఇక్కడ కనిపిస్తున్న ఫోటోయే ప్రత్యక్ష నిదర్శనం. నిర్మాతలు కుర్చీలపై కూర్చుంటే…. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ నేలపై కూర్చున్న దృశ్యాన్ని ఈ ఫోటోలో చూడొచ్చు. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో నటీనటులకు నెలవారి జీతాలు ఇస్తూ సినిమా నిర్మాణం జరిపేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా ఒకప్పుడు అలా పని చేసినవారే. కానీ ఇపుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరోల సినిమాలు తీసుకుంటే ప్రస్తుతం సినిమా బడ్జెట్లో దాదాపు సగం హీరోకు రెమ్యూనరేషన్ రూపంలో వెళుతుంది.