Movies

హీరో రాజశేఖర్ తమ్ముడు కూడా హీరోనే… మీరు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?

సినిమా పరిశ్రమలో ఒకరు హిట్ అయితే చాలు వారి వారసులు వారి వెనక వచ్చి తామేమిటో నిరూపించుకోవాలని తహ తహలాడి వచ్చేస్తూ ఉంటారు. వారిలో కొంత మంది హిట్ అవుతారు. కొంత మంది ఎలా వచ్చారో అలానే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదంతా సినీ పరిశ్రమలో మాములే. అలాగే రాజశేఖర్ తమ్ముడు సెల్వం కూడా రాజశేఖర్ హిట్ అయ్యాక అన్నయ వెనక సినీ పరిశ్రమకు వచ్చాడు. అయితే రాజశేఖర్ తమ్ముడు సెల్వం తమిళ పరిశ్రమ వైపుకు వెళ్ళాడు.Raja Sekhar Brotherతమిళ పరిశ్రమలో కస్తూరి రాజా డైరెక్షన్ లో కస్తూరి హీరోయిన్ గా తన తమ్ముడు సెల్వం లంచ్ అయ్యేలా ప్లాన్ చేసాడు. అయితే అనుకున్నంత సక్సెస్ రాకపోవటంతో తెలుగులో కూడా రాజశేఖర్ ప్రయత్నాలు చేసి రాజశేఖర్,కృష్ణంరాజు కాంబినేషన్ లో వచ్చిన గ్యాంగ్ మాస్టర్ సినిమాలో సెకండ్ హీరోగా చేయించాడు. అయితే రాజశేఖర్ కి ఉన్న స్టామినా తమ్ముడు సెల్వం కి లేకపోవటంతో ఆ సినిమాతో ఫుల్ స్టాప్ పడింది. ఇక సెల్వం తెలుగు పరిశ్రమను వదిలి తమిళంలోకి వెళ్లి అడపా దడపా చిన్న చిన్న పాత్రలను వేస్తున్నాడు.Raja Sekhara Brother Selvaతమిళ డైరెక్టర్ బాల సేతు సినిమా కోసం ముందుగా సెల్వం ను తీసుకున్నాడు. అసలు బాల కు సెల్వం ఎక్కడ కనెక్ట్ కాకపోవటంతో సెల్వం స్థానంలో విక్రమ్ ని తీసుకున్నారు. ఆ సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో కూడా మనకు తెలిసిందే. ఆ సినిమా తెలుగులో శేషు గా విడుదల అయింది. ఆ తర్వాత నటుడిగా అవకాశాలు లేకపోవటంతో డైరెక్షన్ లో వేలు పెట్టి ఒక రీమేక్ సినిమా చేసి పెద్ద డిజాస్టర్ ని మూట కట్టుకున్నాడు సెల్వం. అడపా దడపా సినిమల్లో చిన్న చిన్న వేషాలు వేసిన ప్రస్తుతం బిజినెస్ చూసుకుంటూ హ్యాపీగా గడిపేస్తున్నాడు రాజశేఖర్ తమ్ముడు సెల్వం. Raja Sekhar  Brother