Politics

ఎవరు ఊహించని సంచలన నిర్ణయం తీసుకున్న చిరంజీవి…. షాక్ లో పవన్ కళ్యాణ్….చిరు ప్లాన్ ఏమిటో?

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆపార్టీకి రాయల్ గా వ్యవహరిస్తున్న కేంద్ర మాజీ మంత్రి,మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కాంగ్రెస్ అంటే అసంతృప్తిగా వున్నారు. పోయిపోయి ఎపి సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ టిడిపితో కాంగ్రెస్ జతకట్టడాన్ని ఆయన జీరించించుకోలేకపోతున్నారు. నిజానికి రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ తో అంటీ అంటనట్లుంటున్న చిరంజీవి తాజా రాజకీయ పరిణామాల్లో మరింత దూరం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత గత ఎన్నికలలో బిజెపితో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు రాష్ట్రానికి బిజెపి అన్యాయం చేస్తోందంటూ, ఆ పార్టీతో కటీఫ్ చేసుకున్నారు.

దేశవ్యాప్తంగా బిజెపి వ్యతిరేక శక్తులను కూడకడుతూ జోరు పెంచారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, విభజన హామీలు నెరవేర్చడం లేదని,నిధులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని బాబు విమర్శిస్తూ ఢిల్లీలో గళమెత్తారు. బిజెపి వ్యతిరేక శక్తులను ఏకం చేసున్న ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కల్సి పొత్తుకు సంకేతాలిచ్చారు.
Pawan Kalyan,Chiranjeevi
ఇప్పటికే తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ తో జతకట్టారు. ఇక్కడే చిరంజీవికి మండింది. టిడిపితో జతకట్టడం ఏమిటని ఆయన సన్నిహితుల దగ్గర వాపోయారట. కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరిస్తున్న సి రామచంద్రయ్య కూడా టిడిపితో జతకట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేసారు. ఈయన చిరంజీవికి అంత్యంత సన్నిహితుడు. ప్రజారాజ్యం తరపున కాంగ్రెస్ లో మంత్రి పదవి ఆయన పొందారు.
Kalyan,Mega Star
అలాగే కాంగ్రెస్ లో పలువురు రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే పసుపులేటి బాపిరాజు కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేసి,జనసేనలో చేరిపోయారు. మరో మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కూడా కాంగ్రెస్ ని వీడి జనసేన వైపు చూస్తున్నారు. ఇక తమ్ముడి పార్టీలో చేరాలని కూడా చిరంజీవి యోచిస్తున్నారట. కాంగ్రెస్ సభ్యత్వాన్ని ఆయన పునరుద్ధరించుకోలేదు కూడా.

అందుకే తమ్మునికి అండగా ఉండాలని భావిస్తున్నట్లు భోగట్టా. ఒకవేళ చిరంజీవి వస్తే పార్టీలో గౌరవ అధ్యక్ష పదవి ఇవ్వాలన్న యోచన ఉందట. మొత్తానికి ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఎవరు ఎవరితో జతకడతారో ఎవరు ఏ పార్టీలో చేరతారో గమ్మత్తుగానే ఉంది.