Devotional

కార్తీక మాసంలో కేవలం ఒకే ఒక్క రోజు ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి అనంతమైన పుణ్యం దక్కుతుంది

ప్రతి సంవత్సరం దీపావళి మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. కార్తీక మాసం ప్రత్యేకత ఏమిటంటే కార్తీక మాసంలో ప్రతి రోజు ప్రత్యేకమైనదే. ఈ కార్తీక మాసం శివునికి చాలా ప్రీతికరమైనది. ఆరోగ్య పరంగా,ఆధ్యాత్మిక పరంగా ఈ కార్తీక మాసం ప్రత్యేకమైనది. కార్తీక మాసంలో సోమవారం తెల్లవారుజామున స్నానం చేసి దీపాలు వెలిగించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలగటమే కాకుండా జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ మాసంలో ప్రతి రోజు ప్రత్యేకమైనదే అయినా కొన్ని పర్వ దినాలు ఉన్నాయి.

నాగుల చవితి,నాగుల పంచమి,ఉత్థాన ఏకాదశి,క్షిరభ్ది ద్వాదశి,కార్తీక పౌర్ణమి వంటి పర్వ దినాలు కార్తీక మాసంలో ఉన్నాయి. ఈ కార్తీక మాసంలో శివునికి అభిషేకాలు శివ దర్శనం చేసుకుంటారు. ఈ కార్తీక మాసంలో చవితి,పాడ్యమి,పొర్ణమి,ఏకాదశి,చతుర్దశి,ద్వాదశి తిథుల్లో మహిళలు తెల్లవారు జామున నిద్ర లేచి తలస్నానము చేసి పూజలు చేసి ఉపవాసం ఉంటారు. కార్తీక మాసంలో చేసే స్నానం,ధానం,జపం వంటి వాటి వల్ల ఎన్నో జన్మల పుణ్య ఫలం దక్కుతుంది.

కార్తీక మాసం అన్ని రోజులు స్నానాలు,ఉపవాసాలు చేయలేని వారు కార్తీక మాసం పర్వ దినాలైన సోమవారాలు,ఏకాదశి,ద్వాదశి, పౌర్ణమి రోజులలో స్నానాలు,ఉపవాసాలు చేసిన పుణ్య ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమి రోజు ఉదయం రుద్రాభిషేకం చేయించి రోజంతా ఉపవాసం ఉండి దీపాలను వెలిగిస్తే పాపాలు అన్ని తొలగిపోయి పుణ్యం దక్కుతుంది. కార్తీక మాసంలో దీపారాధన చేస్తే గత జన్మలో చేసే పాపాలు, ఈ జన్మలో చేసే అన్ని పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెపుతున్నాయి. మనలోని అజ్ఞానము అనే చీకటి తొలగిపోయి జ్ఞానము అనే జ్యోతి వెలగాలనేదే ఈ దీపారాధన ఉద్దేశ్యం. మీరు కూడా ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసి పుణ్యాన్ని పొందండి.