Movies

వంశీ పైడిపల్లి భార్య గురించి నమ్మలేని నిజాలు… ఆమె చేస్తుందో తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో మహర్షి మూవీని తెరకెక్కిస్తున్న వంశీ పైడిపల్లి అందరి దర్శకుల్లా కాకుండా కొంచెం నెమ్మదని ఇండస్ట్రీలో వినిపించే మాట. ఫీల్డ్ లోకి వచ్చి దశాబ్దం అవుతున్నా తీసిన సినిమాలు మాత్రం చాలా తక్కువేనని చెప్పాలి. అందుకు కారణం స్లో నెస్. ఏడైనా ప్రాజెక్ట్ చేపడితే అంత వేగంగా ఉండదని అపవాదు ఉండనే ఉంది. అదేసమయంలో పక్కా స్క్రిప్ట్ తోనే సెట్స్ మీదికి వెళ్లడన్న మంచి పేరు ఉంది. పార్టీ స్క్రిప్ట్ వస్తే , ఇక వేగంగా సినిమా కంప్లిట్ చేస్తాడన్న పేరుతెచ్చుకున్నాడు అందుకే మున్నా, బృందావనం,ఎవడు,ఊపిరి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నాడు. వంశీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్య మాలిని,వారికీ ఓ పాప ఉంది.

తెలంగాణాలోని నిర్మల్ కి చెందిన వంశీ తండ్రికి సినిమా థియేటర్ ఉండడం వలన రోజూ సినిమా చూసేవాడట. హైదరాబాద్ భద్రుకా కాలేజీ నుంచి ఎంసిఎ పూర్తిచేసిన వంశీ సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరాడు. అయితే సినిమాల మీద మోజు ఎన్నాళ్ళో అందులో ఉండనివ్వలేదు. 2002లో ఉద్యోగం వదిలేసి,సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వంశీ,అసిస్టెంట్ డైరెక్టర్ గా ఈశ్వర్ మూవీకి పనిచేసాడు.

వర్షం, మాస్, భద్ర సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఇతడు భద్ర మూవీకోసం బెంగుళూరు వెళ్ళినపుడు ఊహించని విధంగా మార్పు వచ్చింది. దీంతో అతని జీవితం ఉన్నట్టుండి కొత్తమలుపు తిరిగింది.బెంగుళూరులో శ్వేతా అనే కాస్ట్యూమ్ డిజైనర్ ఫ్రెండ్ గా ఉండేది. ఆమెను కలవడానికి మాలిని అనే కన్నడ అమ్మాయి వచ్చేది. దీంతో మాలినితో వంశీకి పరిచయం ఏర్పడింది. ఓరోజు అందరూ పార్టీలో పాల్గొన్నారు. పార్టీ ముగిసాక మాలినిని ఇంటివరకూ డ్రాప్ చేసాడు.

మాలిని ఓ కంపెనీలో డిజైనర్ గా చేసేది. ఇక ఆమె తండ్రి రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగి. ఆమెకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఇక ఆమెపై ఏర్పడిన ప్రేమను వ్యక్తం చేయాలని భావించి, నిర్మాత దిల్ రాజు దృష్టిలో పెట్టాడు. అదేమిటి చూసి 5రోజులే అయింది కదా అప్పుడే ప్రేమ ఎలా పుట్టింది అంది దిల్ రాజు అడిగాడట. అయితే అప్పటికే వంశీ మనసుని మాలిని, గ్రహించడంతో వారి మధ్య ప్రేమ నడిచింది. వంశీ ప్రేమ విషయం తెల్సి ఆమె ఇంట్లో దారుణంగా తిట్టేశారట.

బయటకు పంపకుండా ఇంట్లో కట్టడి చేశారట. అయితే వంశీ ప్రేమలోని నిజాయితీని ఎట్టకేలకు గ్రహించారు. మొత్తానికి రెండేళ్ల తర్వాత ఇరు కుటుంబాలు అంగీకరించడంతో భాష తేడాలున్నా వాళ్లిద్దరూ అలా ఒకటయ్యారు. ఇప్పటికీ వంశీ తల్లిదండ్రులను అత్తయ్య మావయ్య అని కాకుండా అమ్మా నాన్న అని పిలుస్తుందట. ఇక ఎవరైనా వీళ్ళింటికి వస్తే, 10,15రకాల నాన్ వెజ్ వంటకాలను రెడీ చేస్తారట.