Movies

మన స్టార్ హీరోయిన్స్ కి డబ్బింగ్ ఎవరు చెప్పుతారో తెలుసా… వారి పారితోషికం ఎంతో తెలుసా?

స్టార్ హీరోయిన్స్ గా ఉన్న సమంతా, అనుష్క,అవికా గోర్ వంటి వారి నటన చూసి అబ్బో బాగా చేసేస్తున్నారని అనుకుంటాం. కానీ వారి పాత్రకు డబ్బింగ్ చాలా ముఖ్యమైనది. డబ్బింగ్ సరిగా లేకపోతే పాత్ర సరిగా పండదు. కాబట్టి మన స్టార్ హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పి వారికీ అంత ఫెమ్ రావటానికి కారణమైన డబ్బింగ్ ఆరిస్ట్స్ గురించి తెలుసుకుందాం. చిన్మయి
సినిమాలు చాలా సెలక్ట్ చేసుకొని మరీ చెప్పుతుంది. అలాగే హీరోయిన్స్ కూడా సెలక్ట్ చేసుకుంటుంది. సినిమాకి 4 లక్షలు తీసుకుంటారు. అంతేకాక చెన్నై నుండి ఫ్లయిట్ టిక్కెట్స్, హోటల్ ఇవన్నీ వేరుగా తీసుకుంటారు.
సునీత
చాలా తక్కువగా బాగా ఫ్రెండ్స్ అయితేనే లేకపోతె హీరోయిన్స్ రిక్వెస్ట్ చేస్తేనే డబ్బింగ్ చెప్పుతున్నారు. సునీత సినిమాకి లక్ష డెబ్భై వేల నుండి రెండున్నర లక్షల వరకు తీసుకుంటారు.
సవితా రెడ్డి
సిమ్రాన్,భూమిక,జ్యోతిక వంటి వారితో మొదలు పెట్టి చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలకు సవితా రెడ్డి డబ్బింగ్ చెప్పింది. ఆమె సినిమాకి 2 లక్షలు తీసుకుంటుంది. ఈమె mca లో భూమిక కు చెప్పారు.
సౌమ్య 
కాజల్, అనుష్క,హన్సిక వంటి స్టార్స్ కి డబ్బింగ్ చెపుతారు. ఈమె 1,50,000 నుండి 1,75,000 రూపాయలవరుకు తీసుకుంటుంది.
హరిత 
ప్రెసెంట్ ఎనభై percent టాప్ హీరోయిన్స్ అందరికి ఈమె డబ్బింగ్ చెపుతుంది. తమన్నా, కథెరిన్ , ఇలియానా , రకుల్ , రాశి ఖన్నా ఇంకా చాలామంది కి ఈమె డబ్బింగ్ చెపుతుంది. ఒక సినిమాకు లక్షన్నర రూపాయలు తీసుకుంటారు.సరిత
అప్పట్లో తాను డబ్బింగ్ చెప్పటానికి రెండు లక్షలు తీసుకొనేది . రీసెంట్ గా అత్తారింటికి దారేది సినిమాలో నదియాకు voice ఇచ్చి ఇప్పటికి మంచి form లో ఉన్నట్టు నిరూపించుకున్నారు.
శిల్ప  
అప్పట్లో ఆమని, సంఘవి, సౌందర్య ఇప్పుడు రీసెంట్ గా అరుంధతి సినిమాలో జేజమ్మకు ఆవిడే డబ్బింగ్ చెప్పారు. అలాగే సైడ్ characters కు కుడా ఈమె డబ్బింగ్ చెబుతారు. సినిమాకి లక్ష రూపాయలు తీసుకుంటారు.
రోజా రమణి 
ఇప్పుడు ఈమె డబ్బింగ్ చెప్పట్లేదు కానీ ఒక వేళా అవసరమైతే లక్ష రూపాయలకు తక్కువ తీసుకోరు.
లిప్సిక 
హెబ్బా పటేల్ మరియు చాల మంది ఇతర హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పుతుంది . ఈమె ఒక సినిమాకి 70,000 తీసుకుంటుంది.మహతి
అవికా గోర్ మరియు ఇతర కొత్త హీరోయిన్స్ కు మహతి తన extraordinary voice తో డబ్బింగ్ చెబుతుంది. ఈమె ఒక సినిమాకు 40,000 నుండి 50,000 రూపాయల వరుకు తీసుకుంటుంది.