Movies

మోహన్ బాబు కొడుకులు మంచు విష్ణు, మనోజ్ సినిమాలకు దూరంగా ఇప్పుడు ఏమి చేస్తున్నారో తెలుసా?నమ్మలేని నిజాలు

రంగుల ప్రపంచం సినిమా రంగంలో కొందరికి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా దూసుకుపోతారు. కొందరికి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే రాణించలేరు. మరికొందరు బ్యాక్ గ్రౌండ్ తో కొన్నాళ్ళు నెట్టుకొచ్చినా, ఆతర్వాత వెనుకబడిపోతారు. ఇప్పుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయులు మంచు విష్ణు,మనోజ్ ల పరిస్థితి అలానే తయారైంది. నిజానికి ఓ సాధారణ నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మోహన్ బాబు తన విలక్షణ నటనతో కలెక్షన్ కింగ్ గా ఎదిగాడు. ఎన్నో సినిమాల్లో హీరోగా అదరగొట్టాడు. డైలాగ్ కింగ్ గా తన సత్తా చాటాడు.

అయితే మోహన్ బాబు కొడుకులు విష్ణు,మనోజ్ బ్రదర్స్ బాలనటులుగా నటించి,హీరోలుగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. వారసులుగా వెండితెరకు పరిచయం అంటూ జరిగింది కానీ,నిలదొక్కుకోవడంలో మాత్రం వెనుకబడ్డారు. ఏవో కొన్ని సినిమాలు హిట్ అయినా,ఈ మధ్య మంచు బ్రదర్స్ కి ఒక్క హిట్టూ లేకుండా పోయింది.

కమర్షియల్ సినిమాలతో విష్ణు,విభిన్న కథాంశాలతో మనోజ్ ఆకట్టుకోవడంతో పాటు సొంతంగా కూడా సినిమాలు తీశారు. అయితే హిట్స్ లేకపోవడంతో చతికిల బడ్డారు.సొంతంగా సినిమాలు తీసే సామర్ధ్యం తగ్గడం,ప్రొడ్యూసర్స్ ఎవరూ కూడా వీళ్ళతో సినిమాలు తీయడానికి ముందుకు రాకపోవడం వంటి కారణాల నేపథ్యంలో మంచు బ్రదర్స్ సినిమాలకు దూరం అయ్యారు.

విష్ణు తీసిన ఓటరు సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు. హైదరాబాద్ లో గల కేర్ స్కూల్ నిర్వహణతో పాటు తిరుపతిలోని విద్యానికేతన్ బాధ్యతలను విష్ణు చూస్తున్నాడు.

ఇక వచ్చే ఏడాది మనోజ్ సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే ప్రస్తుతం సమాజ సేవాకార్యక్రమాలు పేరిట మనోజ్ బిజీ అవుతున్నాడు. మళ్ళీ మంచు బ్రదర్స్ సినిమాల్లో అడుగుపెట్టి,రాణించాలని పలువురు అభిమానులు కోరుకుంటున్నారు.