Movies

తులసిలో నటించిన ఈ బుడ్డోడు ఇప్పుడు ఎలా ఉన్నాడో…ఏమి చేస్తున్నాడో తెలుసా?నమ్మలేని నిజాలు

తెలుగు సినిమా పరిశ్రమలో బాలనటులుగా వచ్చి స్టార్ హీరోలుగా ఎదిగిన వారూ ఉన్నారు. బాలనటులుగా వేసి, ఆతర్వాత వేరే వృత్తుల్లో స్థిరపడిన వారూ ఉన్నారు. చిన్నప్పుడు రాణించి,పెద్దయ్యాక హీరోలుగా ఫెయిల్ అయినవాళ్ళూ ఉన్నారు. మొత్తం మీద బాలనటులుగా వచ్చినవాళ్లకు తెలుగు ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు మాత్రం ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే తులసి సినిమాలో వెంకటేష్ కొడుకుగా నటించిన బుడ్డోడు మాస్టర్ అతులిత్ గుర్తున్నాడు కదా. ఆసినిమాలో అతడు నటనతో జనాన్ని మెప్పించాడు. ముద్దు ముద్దు మాటలతో అందరినీ కట్టిపడేసిన ఈ కుర్రాడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే ఆశ్చర్య పోతాం.

తులసి తర్వాత పాండురంగడు, రక్ష,నచ్చావులే వంటి మూవీస్ లో మాస్టర్ అతులిత్ నటించాడు. చదువుకునే రోజుల్లో సినిమా ఆడిషన్స్ కి మాస్టర్ అతులిత్ ఫోటోలు పంపిస్తే,అందులో సెలక్ట్ అయి తులసిలో ఛాన్స్ కొట్టేసాడు. అలా పేరెంట్స్ ప్రోత్సాహంతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత తన నటనతో మరిన్ని ఛాన్స్ లు దక్కించుకున్నాడు. ఇక తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న మాస్టర్ అతులిత్ తాజాగా ఘంటసాల బయోపిక్ లో నటిస్తున్నాడు. ఘంటసాల పాత్రతో అందరినీ మెప్పించబోతున్నాడు.

ఇక తాజాగా రిలీజైన టీజర్ చూస్తే, తులసిలో నటించిన పిల్లోడు,ఘంటసాల బయోపిక్ లో వేసే పిల్లోడు ఒకేదేనా అని ఆశ్చర్య పోతాం అని చెప్పాలి. ఎన్నో వేల పాటలు పాడిన మధుర గాయకుడు ఘంటసాల బయోపిక్ లో నటించడం తన పూర్వ జన్మ సుకృతమని ఇక తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న మాస్టర్ అతులిత్ చెప్పాడు.

అప్పట్లో అల్లరి చేస్తూ,అందరినీ నవ్వించిన ఈ బుడ్డోడు ఇప్పుడు తెలుగుజాతి గర్వించతగ్గ ఘంటసాల పాత్రలో నటిస్తుండడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. కాగా హీరోల్లో వెంకటేష్ అంటే ఎక్కువ ఇష్టమని చెప్పే మాస్టర్ అతులిత్ కి హీరోయిన్స్ లో నయనతార అంటే ఇష్టమట.

ఎందుకంటే తులసిలో నయనతార చూపిన ప్రేమే తనకు ఆమెపై అభిమానం ఏర్పడడానికి కారణం అని చెబుతున్నాడు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతూ,ఆయనతో కల్సి నటించడమే లక్ష్యమని మాస్టర్ అతులిత్ చెప్పుకొచ్చాడు.