Movies

ఇంద్రభవనాన్ని తలపించే మహేష్ కార్వాన్ లో రహస్యాలు ఇవే

సినిమా షూటింగ్ అంటే ఆషామాషీ కాదు. ఒక్కో టేకింగ్ కి గంటల సమయం పట్టేస్తుంది. ఇక విసుగు, చిరాకు అన్నీ కమ్మేస్తాయి. ఫ్రెష్ నెస్ పోతుంది. అయితే పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం మేరకు ఎన్నో ఆధునిక వసతులు అందుబాటులోకి రావడంతో ఇప్పటి హీరోలు, హీరోయిన్స్ వాటిని బాగానే సద్వినియోగం చేసుకుంటున్నారు. బస్సుల తరహాలో ఉండే కార్వాన్ లు అందుబాటులోకి వచ్చాయి. చూడ్డానికి బస్సులాగే కనపడ్డా, లోపలకు వెళ్తే, ఇంద్రభవనమే. అందుకే వీటిని నడిచే ఇల్లు అంటారు. షూటింగ్ గ్యాప్ లో ఇందులో విశ్రాంతి తీసుకుంటారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు వినియోగించే కార్వాన్ అయితే ఏకంగా 6కోట్ల రూపాయలుంటుందట. ఇందులో ఉండే సౌకర్యాలు ఇంటిని మించి ఉంటాయట.

హౌస్ ఆన్ వీల్స్ గా ఉండే కార్వాన్ లో ఉంటె ఇంట్లోనే ఉన్నట్టు ఫీలవ్వచ్చు. అగ్ర హీరో హీరోయిన్స్ అందరూ తమ టేస్ట్ కి తగ్గట్టు కార్వాన్ లు డిజైన్ చేయించుకుంటున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు వినియోగిస్తున్న కార్వాన్ షూటింగ్ స్పాట్ కి మహేష్ కన్నా ముందే చేరుతుంది. అత్యాధునికంగా డిజైన్ చేసిన ఈ కార్వాన్ లో ఉండే సౌకర్యాలు చూస్తే దిమ్మతిరుగుతుంది. చూడ్డానికి ఏసీ బస్సుల కనిపించినా, ఫైవ్ స్టార్ హోటల్ ఫెసిలిటీస్ కనిపిస్తాయి. కార్వాన్ మొత్తం సెంట్రల్ ఎయిర్ కండిషన్డ్ సిస్టం తో ఉండే కార్వాన్ ఇంటీరియర్ చూస్తే వైట్ అండ్ బ్రౌన్ కలర్స్ వినియోగించారు.

వాల్స్ వైట్ కలర్ లో ఉంటె,ఫర్నిచర్ ఇతర వస్తువులన్నీ బ్రౌన్ షెడ్ లో కనిపిస్తాయి. కింద ఉండే ఉడెన్ ఫ్లోర్ తళతళ మెరుస్తుంది. స్పెషల్ గా కింగ్ సైజ్ బెడ్ ఏర్పాటుచేశారు. దేనిమీద ఓ ఫామిలీ నిద్రించవచ్చు.షూటింగ్ పర్పస్ కోసం ఏర్పాటుచేసిన కార్వాన్ లో మహేష్ కోసం ఓ మేకప్ రూమ్ ఉంటుంది. దానికి ఎటాచ్డ్ అల్టా మోడ్రన్ బాత్ రూమ్ ఉంటుంది.

ఆలిండియా పర్మిట్ గల భారీ సోఫాసెట్,ఎక్కడ కూర్చున్నా కనిపించేలా రెండు ఎల్ ఇడి టెలివిజన్ స్క్రీన్స్,వాటికి ఎటాచ్డ్ అత్యాధునిక హోమ్ థియేటర్స్, ఓ మినీ ఫ్రిజ్,అందులో ఎక్కువగా ఫ్రూట్ జ్యుస్ లకు బదులు వాటర్ బాటిల్స్ ఉంటాయి. కొండ కోనల్లో ఉండే నీటి బుగ్గల నుంచి, సెలయేరు నుంచి సేకరించిన నీటిని అది కూడా ముల్షి కంపెనీ తయారుచేసే స్పెషల్ నేచురల్ వాటర్ ని మహేష్ బాబు వినియోగిస్తాడు.

ఒక్కో బాటిల్ వేలల్లో రేటు పలుకుతుంది. ఇక ఆలిండియాలో ఎక్కడ మహేష్ బాబు షూటింగ్ జరిగిన రెండు రోజుల ముందే ఈ కార్వాన్ అక్కడికి వెళుతుంది. ఇక ఇలాంటి కార్వాన్ బాలీవుడ్ లో షారుక్ ఖాన్ దగ్గర మాత్రమే ఉందట. దటీజ్ మహేష్ బాబు.