Movies

హీరోయిన్ మీనా తల్లి ఒకప్పటి స్టార్ నటి… ఆమె ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

సీతారామయ్య గారి మనవరాలు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మీనా బాలనటిగా చాలా సినిమాలు చేసింది. 1975సెప్టెంబర్ 16న చెన్నైలో జన్మించిన మీనా దక్షిణాది భాషలన్నిటిలో గుర్తింపు తెచ్చుకుంది. తండ్రి దురైరాజు టీచర్ గా పనిచేసారు. ఇక ఆమె తల్లి రాజమల్లిక ఒకనాటి తమిళ నాట హీరోయిన్. అలాగే మలయాళం లో కూడా నటిగా రాణించింది. సినీ అనుభవం గల రాజమల్లిక తనకూతురు మీనాను హీరోయిన్ గా చేయడానికి ఎంతో కష్టపడింది. జెమిని గణేష్ ఓ పార్టీలో మీనాను చూసి,బోలెడు భవిష్యత్తు ఉందని అఫర్ ఇచ్చారట. ఇక రాజమల్లిక మరో అడుగువేసి,నిర్మాత ఏ ఎం రత్నం దగ్గరకు తీసుకెళ్లగా ఆయన కూడా ఛాన్స్ ఇచ్చాడు.

మొత్తం మీద మీనా బాలనటిగా సిరివెన్నెల,రెండు రెళ్ళు ఆరు మూవీలతో మంచి పేరు సంపాదించుకుంది. ఇక హీరోయిన్ గా అవతారం ఎత్తాక తెలుగు,తమిళ,మలయాళ,కన్నడ భాషల్లో హీరోయిన్ గా రాణించింది. తెలుగులో చంటి,సుందరకాండ,ప్రెసిడెంట్ గారి పెళ్ళాం,అల్లరి మొగుడు చిత్రాలతో టాప్ హీరోయిన్ అయింది. సినిమా ఛాన్స్ ల కారణంగా 8వ తరగతి నుంచే స్కూల్ నుంచి దూరమైన మీనా ప్రేవైట్ గా ఎం ఏ పూర్తిచేసింది. మీనా అన్ని భాషా చిత్రాల్లో నటించడమే కాదు, ఆ భాషలను కూడా సులువుగా మాట్లాడ్డం విశేషం.

1991నుంచి 2000సంవత్సరం వరకూ తెలుగు, తమిళ చిత్ర రంగాల్లో అగ్ర నాయికగా నిల్చింది. ఇక ఓసారి మీనా షూటింగ్ కోసం కాకినాడ సమీపంలోని ఓ మారుమూల గ్రామానికి వచ్చింది. అది బాలయ్య నటించే బొబ్బిలి సింహం మూవీ. అందులో మీనా హీరోయిన్. అయితే మీనా మేకప్ మాన్ అక్కడికి రాలేకపోతే,మీనాకు ఆమె తల్లి రాజమల్లిక మేకప్ వేసింది. ఇక సినిమా ఛాన్స్ లు తగ్గాయని తెల్సి, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ని 2009లో మీనా పెళ్లిచేసుకుంది.

వీరికి పుట్టిన పాపకు నైనికా అనే పేరు పెట్టుకున్నారు. పెళ్లయ్యాక కూడా కేరక్టర్ ఆర్టిస్టుగా మంచి రోల్స్ పోషిస్తోంది. ఇక మీనా కూతురు నైనికా తమిళంలో విజయ్ సినిమాలో బాలనటిగా నటించింది. ఆతర్వాత సిద్ధికీ డైరెక్షన్ చేసిన భాస్కర్ ఓరు రాస్కెల్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఇక అసలు విషయం ఏమిటంటే విజయ్,సిద్ధిఖీలతో కల్సి నటించాలని మీనా అనుకునేదట. కానీ వారితో తన కూతురు నటించినందుకు మీనా తెగ సంతోషపడుతోంది.