7జీ బృందావనం కాలనీ హీరో గుర్తు ఉన్నాడా… ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో తెలుసా?
విభిన్నమైన కధాంశంతో తెరకెక్కిన ‘7జీ బృందావనం కాలనీ’ సినిమా తెలుగు,తమిళ భాషల్లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. నిర్మాతకు కాసుల వర్షాన్ని కురిపించిన ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో హీరో,హీరోయిన్స్ గా రవికృష్ణ,సోని అగర్వాల్ నటించాడు. రవి కృష్ణ ప్రముఖ నిర్మాత ఏయం. రత్నం కొడుకు. తండ్రితో పాటు ప్రొడక్షన్ వ్యవహారాలను చూసుకుంటూ ఉండే రవికృష్ణ అనుకోకుండా ఈ సినిమాలో హీరోగా మారాడు.
సాధారణంగా సినీ ప్రపంచంలో ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమాలో నటించిన నటులకు వరుస అవకాశాలు రావటం సహజమే. అలాగే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ సోని అగర్వాల్ కు అవకాశాలు వచ్చాయి. కానీ హీరో రవికృష్ణ కి సరైన అవకాశాలు రాలేదు.
2008లో బ్రహ్మానందం డ్రామా కంపెనీ అనే కామెడీ సినిమాలో నటించిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవటంతో రవికృష్ణకి పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. రవికృష్ణ సోదరుడు జ్యోతి కృష్ణకు దర్శకుడిగా నిరూపించులోనే అవకాశం ఆక్సిజన్ రూపంలో వచ్చింది.
అది కూడా తీవ్రమైన నిరాశను కలిగించింది. అయినా తన ప్రయత్నాలలో బిజీగానే ఉన్నాడు. ఈ మధ్య జరిగిన ఒక వేడుకలో రవికృష్ణ కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు. ఎందుకంటే అతను అంతలా మారిపోయాడు. తనని చాలా మంది గుర్తుపట్టలేకపోయారట.
ప్రస్తుతం రవికృష్ణ స్లిమ్ అయ్యే పనిలో ఉన్నాడట. అలాగే రీ ఎంట్రీ ఇవ్వటానికి కూడా సిద్ధం అవుతున్నాడు. మరి ఇప్పుడిప్పుడే దర్శకుడిగా ఎదుగుతున్న అన్నయ్య దర్శకత్వంలో చేస్తాడా లేక బయట సినిమాలకు చేస్తాడా అనే విషయం మీద స్పష్టత లేదు.