పెప్సీ యాడ్ లో కన్పించిన మొదటి స్టార్ పవన్ కళ్యాణ్… ఆ తర్వాత పెప్సీ యాడ్ ఎందుకు చేయలేదో….???
దక్షిణాదిన మొదటిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెప్సీ యాడ్ లో నటించాడు. కొన్ని సంవత్సరాలు ఆ యాడ్ లో కనిపించిన పవన్ ఆ తర్వాత ఆ యాడ్ లో కన్పించటం లేదు. దానికి గల కారణం తెలిస్తే పవన్ మీద అభిమానం పెరుగుతుంది. పవన్ పెప్సీ యాడ్ లో నటించినప్పుడు ఆ బ్రాండ్ వ్యాల్యూ ఆంధ్రప్రదేశ్(అప్పటికి విడిపోలేదు) లో బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు పవన్ తాగేది పెప్సీ…మనం అదే త్రాగుదామని అందరు పెప్సీ కి ఎడిక్ట్ అయ్యిపోయారు.
కొన్ని రోజుల తర్వాత కూల్ డ్రింక్స్ లో పెస్టిసైడ్స్ ఉన్నాయని పుకార్లు రావటంతో పవన్ ఆ యాడ్ నుంచి తప్పుకున్నారు. ఎందుకంటే ఆ డ్రింక్ త్రాగిన తన అభిమానులకు ఏమైనా అవుతుందేమో అని భావించి తప్పుకున్నాడు. ఆ తర్వాత పవన్ యాడ్ లలో కన్పించిన దాఖలాలు లేవు.
పవన్ ఒకే అంటే చాలా పెద్ద పెద్ద కంపెనీలు కోట్లు ఇవ్వటానికి రెడీగా ఉన్నాయి. అయినా అభిమానుల కోసం ఆ ఆఫర్స్ అన్నింటిని రిజెక్ట్ చేసేసాడు. తనకు ఉన్న ఫ్యాన్స్ లో ఎక్కువగా తాను చెప్పిన మాటకు గౌరవిస్తారని, తాను ఏ యాడ్ లో నటించినా ఆ ప్రభావం అభిమానులపై ఉంటుందని పవన్ అభిప్రాయపడ్డారట. అందుకే వారు ఎన్ని కోట్ల డీల్ ఇచ్చినా పట్టించుకోలేదు.. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్.