మన స్టార్ హీరోల విలాసవంతమైన ఇల్లులు చూస్తే షాక్ అవుతారు
టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదగాలంటే కృషి,పట్టుదలతో పాటు కాస్త అదృష్టం కూడా తోడవ్వాలి. అప్పుడే స్టార్ హీరో హోదా వస్తుంది. దానిని నిలబెట్టుకోవటం కూడా కత్తి మీద సాము లాంటిదే అని చెప్పవచ్చు. ఆలా నిలబెట్టుకున్న మన స్టార్ హీరోల జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోవటం కూడా కష్టమే. ఎందుకంటే ఆ జీవితం అంతా విలాసవంతంగా ఉంటుంది మరి. అలాంటి స్టార్ హీరోల విలాసవంతమైన ఇల్లుల మీద ఒక లుక్ వేద్దాం.
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని తెలుగు వారు లేరు. 20 సంవత్సరాల క్రితమే కోటి రూపాయిల పారితోషికాన్ని తీసుకున్న తోలి టాలీవుడ్ హీరో. ఖైదీ నెంబర్ 150 సినిమాకి 30 లక్షల పారితోషికం తీసుకున్నాడు. అలాంటి మెగాస్టార్ ఇళ్ళు ఎలా ఉంటుందో చూడండి.
రజనీకాంత్
బస్ కండక్టర్ స్థాయి నుండి సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగిన రజనీకాంత్ ఇల్లు ఎలా ఉంటుందో చూడండి.
పవన్ కళ్యాణ్
మెగాస్టార్ తమ్ముడిగా పరిశ్రమకు వచ్చిన పవన్ కళ్యాణ్ తొందరగానే సొంత ఇమేజ్ తో ముందుకు సాగుతూ ఎక్కువ పారితోషికం తీసుకొనే స్టార్ హీరోగా ఎదిగాడు. పవన్ కళ్యాణ్ కి అభిమానులు కూడా చాలా ఎక్కువ. అలాంటి అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ ఇల్లు ఎలా ఉంటుందో చూడండి.
మహేష్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఒక వైపు సినిమాలు చేస్తూ మరో వైపు యాడ్స్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నాడు. అలాంటి మహేష్ బాబు ఇల్లు ఎలా ఉంటుందో చూడండి.
ప్రభాస్
కృష్ణంరాజు వారసుడిగా సినీ పరిశ్రమకు వచ్చి బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చుకున్నాడు. అలాంటి ప్రభాస్ ఇల్లు ఎలా ఉంటుందో చూడండి.
జూనియర్ ఎన్టీఆర్
ఎన్టీఆర్ తన సొంత ప్రతిభతో స్టార్ హోదా సంపాదించి ఎన్నో ఆస్తులను కూడబెట్టాడు. అంతేకాక తన భార్య తరుపు నుండి కూడా బాగానే ఆస్తులు వచ్చాయి. అలాంటి ఎన్టీఆర్ ఇల్లు ఎలా ఉందో ఒక్కసారి చూడండి.
అల్లు అర్జున్
గీతా ఆర్ట్స్ అధినేత అయిన అల్లు అరవింద్ కొడుకుగా టాలీవుడ్ కి వచ్చి చాలా తక్కువ సమయంలోనే స్టైలిష్ స్టార్ గా మారాడు అల్లు అర్జున్. అలాంటి అల్లు అర్జున్ ఇల్లు ఎలా ఉంటుందో చూడండి.