Movies

సినిమాల కన్నా బిజినెస్ లో ఎక్కువ సంపాదిస్తున్న స్టార్స్ 

రామ్ చరణ్ 
టాలీవుడ్ లో ఎక్కువ పారితోషికం తీసుకొనే హీరోలలో రామ్ చరణ్ ఒకడు. మెగాస్టార్ వారసుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయంలోనే తానేమిటో నిరూపించుకున్నాడు. అపోలో వారసురాలు ఉపాసనని పెళ్లి చేసుకున్నాక బిజినెస్ లోకి కూడా ఎంటర్ అయ్యి సక్సెస్ గా ముందుకు సాగుతున్నాడు. చరణ్ కి ట్రూ జెట్ అనే ఒక విమానయాన సంస్థ లో వాటాలు ఉన్నాయి. 
మోహన్ బాబు 
విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకొని సుమారుగా 550 సినిమాల్లో నటించిన మోహన్ బాబు ముగ్గురు పిల్లలకు సొంత ప్రొడక్షన్ హౌస్ లు ఉన్నాయి. విష్ణుకి భార్య కారణంగా ఆర్ సి రెడ్డి సంస్థ లో వాటాలు వచ్చాయి. అంతేకాక సొంత యానిమేషన్ కంపెనీ ని కూడా విష్ణు రన్ చేస్తున్నాడు. ఇక మంచు లక్ష్మి విషయానికి వస్తే మంచు లక్ష్మి అనేక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థల్లో వాటాలు ఉన్నాయి.
అక్కినేని నాగార్జున 
టాలీవుడ్ హీరోల బిజినెస్ ల గురించి మాట్లాడుకుంటే మొదట నాగార్జున పేరే గుర్తుకు వస్తుంది. ఆలా నాగార్జున వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ మధ్యనే బ్యాడ్మింటన్ లీగ్ లో ముంబై మాస్టర్స్ టీం ని ఆయన సొంతం చేసుకున్నారు. 
శర్వానంద్ 
వెరైటీ కథలను ఎంచుకుంటూ హిట్ బాటలో వెళుతూ ఉన్న శర్వానంద్ జూబిలీ హిల్స్ లో బెంజ్ అనే కాఫీ షాప్ ని ఏర్పాటు చేసి బాగానే సంపాదిస్తున్నాడు. 
ఆర్య 
తమిళ హీరో అయ్యిన ఆర్య వరుడు సినిమాలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయస్తుడే. అతనికి షో పీపుల్ అనే ప్రొడక్షన్ హౌస్ మరియు రెండు పెద్ద రెస్టారెంట్స్ ఉన్నాయి. 
కమల్ కామరాజు
ఆవకాయ బిర్యానీ సినిమాలో నటించిన సరే ఫోకస్ వ్యాపారం మీద పెట్టి పెయింటర్ అయిన కమల్ , తాను వేసిన పెయింటింగ్ లను షోలు ఏర్పాటు చేసి అమ్ముతున్నాడు.
అల్లు అర్జున్ 
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జూబిలీ హిల్స్ లో 800 జూబిలీ అనే మాంచి రెస్టారెంట్ ని రన్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. 
ప్రణీతా శుభాష్
హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయి సెకండ్ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించిన ప్రణీతా శుభాష్ బూట్ లెగ్గర్ అనే ఒక రెస్టారెంట్ ని బెంగళూరు లో స్థాపించి సక్సెస్ గా రన్ చేస్తుంది. 
శృతి హాసన్ 
కమల్ హాసన్ కూతురిగా సినీ రంగానికి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. ఆమెకు ఇసిడ్రో అనే ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఆ ప్రొడక్షన్ హౌస్ ద్వారా షార్ట్ ఫిలిమ్స్ , యానిమేషన్ సినిమాలు , వెబ్ సిరీస్ లను తమిళ్ లో ప్రొడ్యూస్ చేస్తూ రాణిస్తోంది.
శశాంక్ 
చిన్న హీరోగా బాగా సక్సెస్ అయినా శశాంక్ కి మాయాబజార్ అనే పాపులర్ రెస్టారెంట్ ఉంది. దాన్ని చాలా సక్సెస్ గా రన్ చేస్తున్నాడు.