“దేవుళ్ళు” సినిమాలో నటించిన ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
దశాబ్దం క్రితం వచ్చిన ‘దేవుళ్లు’ సినిమా మీకు గుర్తు ఉందా? ఆ సినిమాలో ఇద్దరు పిల్లలు తమ తల్లితండ్రులు కలిసి ఉండాలని ఎన్నో దేవుళ్లను మొక్కుకొని ఆలయాలను దర్శించటం చూసాం. ఆ సినిమాలో మీ ప్రేమ కోరే చిన్నారులం,మీ ఒడిన ఆడే చందమామలం అంటూ పాడిన చిన్నారులు…ఆ పాటను ఎప్పుడు విన్నా మనకు గుర్తుకు వస్తారు. ఈ సినిమాలో అమ్మ,నాన్న ప్రేమ కోసం పరితపించే పిల్లలుగా బేబీ నిత్యా,మాస్టర్ నందన్ నటించి మెప్పించారు.
నిత్యా సుమారుగా 20 సినిమాల్లో బాలనటిగా నటించి రెండు సార్లు నంది అవార్డు లను గెలుచుకుంది. లిటిల్ హార్ట్స్,చిన్ని చిన్ని ఆశ సినిమాల్లో ఆమె నటనకు ఈ అవార్డ్స్ వచ్చాయి.
ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి దృష్టి అంతా చదువు మీద పెట్టి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఇన్ఫోసిస్ లో మంచి ఉద్యోగాన్ని సంపాదించింది.
ఉద్యోగం చేస్తున్న ఆమె మనస్సు అంతా సినిమాలపై ఉండుట వలన చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసేసి సినిమాల్లోకి వచ్చేసింది నిత్యా.
తెలుగులో దాగుడుమూత దండాకోర్,పడేసావే వంటి సినిమాల్లో నటించింది. మరోవైపు తమిళంలో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. రాశి,తరుణ్,తనీష్ బాలనటులుగా వచ్చి ఆ తర్వాత హీరో,హీరోయిన్స్ గా మారినవారే.
నిత్యా కూడా హీరోయిన్ గా మంచి మంచి సినిమాలు చేసి మంచి పేరు సంపాదించాలని కోరుకుందాం.