‘పదహారేళ్ల వయసు’కు శ్రీదేవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
‘పదహారేళ్ల వయసు’ సినిమా తెలుగులో శ్రీదేవి కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా. రాఘవేంద్రరావుగారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించింది. దర్శకేంద్రుడు శ్రీదేవిలోని గ్లామరసాన్ని తెరపైన ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యారు. ఈ సినిమా తర్వాతే శ్రీదేవికి ఎన్టీఆర్ తో ‘వేటగాడు’ చేసే అవకాశం వచ్చింది.
ఇక అసలు విషయంలోకి వస్తే ‘పదహారేళ్ల వయసు’ సినిమాలో నటించినందుకు శ్రీదేవి ఎంత పారితోషికం తీసుకుందో తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. సినిమా బడ్జెట్ 10 లక్షల 50 వేల రూపాయలు అయితే… శ్రీదేవి అక్షరాలా 30 వేల రూపాయల పారితోషికాన్ని తీసుకుంది.
ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులందరిలోకీ అత్యధిక పారితోషికం తీసుకున్నది శ్రీదేవి. అప్పటికే సీనియర్ అయినా చంద్ర మోహన్ 12 వేల ఐదువందల రూపాయల పారితోషికాన్ని మాత్రమే తీసుకున్నాడు.
ఈ సినిమా నిర్మాతకు కూడా బాగా లాభాలను తీసుకువచ్చింది. నిర్మాత పది లక్షలు పెట్టుబడి పెడితే 20 లక్షల వరకు లాభం వచ్చింది. ఈ సినిమాకి దర్శకుడు రాఘవేంద్రరావు మాత్రం 55 వేల రూపాయలు పారితోషికం అందుకున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా చేయాలని జయప్రద ముచ్చట పడ్డారు. అలాగే వికలాంగ పాత్రను శోభన్ బాబుతో వేయించాలని ఫిలిం మేకర్స్ అనుకున్నారు. కానీ ఈ సినిమా శ్రీదేవికి, చంద్రమోహన్ కు రాసి పెట్టి ఉంది కాబోలు..! ఇక ఆ తర్వాత మూవీ సూపర్ హిట్ అవ్వడం, శ్రీదేవి కెరీర్ పీక్స్ కు చేరుకోవడం అందరికీ తెలిసిందే..!