సర్జరీలు వికటించి మరణించిన స్టార్స్
సినీ ప్రపంచం అంటేనే మాయ ప్రపంచం ప్రపంచంలో చోటు దక్కాలంటే గ్లామర్ ఉండాల్సిందే. అందువల్ల ఆ అందం కాపాడుకోవటానికి సినీ తారలు పడరాని పాట్లు పడుతూ ఉంటారు. ఒకప్పుడు గ్లామర్ కోసం కసరత్తులు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారి ప్లాస్టిక్ సర్జరీ వైపుకి వెళ్ళుతున్నారు. కాస్త ప్రమాదం ఉందని తెలిసిన తమ అందాన్ని కాపాడుకోవటానికి అటు వైపుకే వెళ్ళుతున్నారు.
స్టార్ హీరోయిన్ శ్రీదేవి మరణించటంతో ఈ సర్జరీల గురించి చర్చ సాగుతుంది. వారి గ్లామర్ కాపాడుకోవటానికి రిస్క్ అని తెలిసిన ప్లాస్టిక్ సర్జరీ వైపు మొగ్గు చూపుతున్నారు. కొంత మంది ఈ సర్జరీల కారణంగా బాగానే ఉంటున్నారు. కొంత మందిలో మాత్రం ఈ సర్జరీలు వికటించి మరణానికి దారి తీస్తున్నాయి.
శ్రీదేవి
గ్లామర్ డాల్ శ్రీదేవి మొదట ప్లాస్టిక్ సర్జరీ అనే ట్రెండ్ ని స్టార్ట్ చేసిందని చెప్పుతూ ఉంటారు. ఆమె తేడాగా కనిపించే ముక్కుకు సర్జరీ చేయించుకొని అందంగా మార్చుకున్నారు.
మూడు సంవత్సరాల క్రితం ముక్కుకు సర్జరీ, స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వటం, లైపోసెక్షన్ ఆపరేషన్ చేయించుకుంది. ఆపరేషన్ కు సంబంధించి తీసుకున్న పెయిన్ కిల్లర్లు , గుండెపై ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగా ఉంది.
ఆమె అభిమానులకు విషాదాన్ని మిగిల్చి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఆమె మరణం ఎలా సంభవించిందో అనేది కాస్త మిస్టరీగానే ఉంది.
శ్రీహరి
సినీ పరిశ్రమలో చాలా కస్టపడి హీరోగా ఎదిగిన వ్యక్తి శ్రీహరి. శ్రీహరి అడిగిన వారికీ కాదని అనకుండా సాయం చేసేవాడు. శ్రీహరికి ఎక్కువగా గుట్కా తీసుకొనే అలవాటు ఉంది.
ఆ అలవాటు కారణముగా లివర్ కి సంబందించిన వ్యాధి రావటంతో ఆ ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సమయంలో శ్రీహరి బాగా చిక్కిపోయి కనిపించాడు. అయన తీసుకున్న కొన్ని మెడిసిన్స్ వికటించి షూటింగ్ సమయంలో ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయి మరణించారు.
ఆర్తి అగర్వాల్
ఒకానొక సమయంలో ఆర్తి అగర్వాల్ స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. పెళ్లి తర్వాత బాగా లావుగా మారటంతో సన్నపడటానికి లైపోసెక్షన్ ఆపరేషన్ చేయించుకుంది. ఆ ఆపరేషన్ వికటించి గుండెపోటుతో మరణించింది.
మైకేల్ జాక్సన్
ఒకానొక డాన్స్ రిహార్సల్ సందర్భంగా ఆయన పడిపోయినప్పుడు తలకు తీవ్ర గాయం అయ్యింది. దానితో ఆ నొప్పి తట్టుకోవటానికి, ఆయన పెయిన్ కిల్లర్స్ విపరీతంగా వాడేవారు.
అయితే కొన్ని వేల సార్లు ఆయన తీసుకున్న పెయిన్ కిల్లర్లు ఆయన గుండెపై ప్రభావం చూపించాయి. అందుకే ఆయన ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో గుండెపోటుతో మరణించారు.
దాసరి నారాయణరావు
దాసరి వయస్సుతో పాటు ఊబకాయం కూడా పెరుగుతూ వచ్చింది. శరీరాన్ని అదుపులో పెట్టుకోవటానికి పేగులకు సంబంధించి ఆపరేషన్ చేయించుకున్నారు. అది వికటించడంతో దాసరికి మరల ఆపరేషన్ చేయవలసి వచ్చింది. పేగుల్లో చీము చేరడంతో ఇక మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యి ఆయన గుండె పోటుతో మరణించారు.