మస్తానమ్మ వంటలు ఎలా ఫేమస్ అయ్యాయో తెలుసా?
వంట అనేది ఓ టాలెంట్. సరిగ్గా వండితే ఆ రుచే వేరు. ఇక వంటతో ఆకట్టుకున్న వృద్ధురాలు మస్తానమ్మ. ఈమె వంటకాలంటే అరబ్ షేక్ లు కూడా ఆమడ దూరం నుంచి లొట్టలేస్తూ వస్తారు. ఆధునిక యుగంలో సాయత్రం కట్టెలపై ఈమె చేసే వంట అత్యద్భుతం. చికెన్ వండితే ఈమె మాత్రమే వండాలి అన్నంతగా మారింది. ఇక యూట్యూబ్ లో ఈమె వంటకాలకు యమగిరాకీ . అసలు ఏమాత్రం చదువుకొని ఓ గ్రామీణ వంట మాస్టారు. ఆమె మనుమడు తన బామ్మతో చేయించిన వంటకాలు వరల్డ్ ఫేమస్ అయ్యాయి. అయితే అనారోగ్యంతో ఆమె ఈలోకం వీడింది.
గుంటూరు జిల్లా గుడివాడ గ్రామం. అక్కడే పుట్టి,అక్కడే పెళ్లి కూడా. 11ఏళ్ళవయస్సులోనే పెళ్లయింది. 20ఏళ్లకు ఐదుగురు పిల్లల్ని కనేసింది. అందులో అనారోగ్యంతో నలుగురు పోయారు.ఒక కొడుకు మిగిలాడు. ఇది మస్తానమ్మ జీవితంలో విషాదం. ఇక 22వ ఏట భర్త మరణించాడు. ఇక
కుటుంబ పోషణకు కూలీపనికి వెళ్లడం మొదలు పెట్టింది. ఈమె చనిపోయేదాకా పూరిగుడెసెలోనే గడిపింది. వందేళ్లకు పైగా బతికింది. ఆమె ఆహారపు అలవాట్లే ఆమెను శతాధిక వృద్ధురాలిగా చేశాయని ఆ ఊళ్ళో వాళ్ళు అంటారు. ఇక మస్తానమ్మకు నెలకు వెయ్యి రూపాయల ప్రభుత్వ పెన్షన్ వచ్చేది. ఆమె వంట ఆమె చేసుకోవడంతో పాటు ఇతరులకు వండిపెట్టేది. మనవడు అంటే ఎంతోఇష్టం అందుకే అతడు అడిగిన వెంటనే వంటలకు సిద్ధం అయింది. వీడియో అంటే ఆమె కు తెలియకపోయినా ఆమె వంటలకు యూట్యూబ్ లో కంట్రీ ఫుడ్స్ పేరిట మస్తానమ్మ ఛానల్ కి మిలియన్ పైనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు.
తొలిసారిగా ఆమె చేసిన బెండకాయ కూరకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. ఆతర్వాత వరుసగా వంటకాలకు వ్యూస్ రావడంతో ఏకంగా లండన్ నుంచి బిబిసి వాళ్ళే వెతుక్కుంటూ వచ్చి ఆమె గురించి విశ్వానికి తెలియపరిచారు. అంతగా పాపులారిటీ సంపాదించుకుంది. బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీ కారణంగా వరల్డ్ వైడ్ గా పబ్లిసిటీ లభించింది. చికెన్,మటన్,రొయ్యలు,చేపలు,పీతలు,గుడ్లు,ఇలా మస్తానమ్మ టచ్ చేయని వంటకం లేదంటే అతిశయోక్తి లేదు.