Movies

చిరంజీవి కెరీర్ లో అరుదైన రికార్డ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవి విలన్,కేరక్టర్ ఆర్టిస్టుగా వేషాలు వేస్తూ ఒక్కసారిగా హీరోగా మారిపోయి,ఏకంగా చిత్ర సీమను శాసించే మెగాస్టార్ స్థాయికి ఎదిగాడు. 1977కాలం అది. అప్పట్లో అడవిరాముడు మూవీతో ఎన్టీఆర్ మూడు కోట్ల కలెక్షన్స్ సాధించి, అప్పటికే రికార్డుగా గల సూపర్ స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు రికార్డులను బద్దలు కొట్టాడు. మరో ఐదేళ్ల తర్వాత ప్రేమాభిషేకం సినిమాతో 3న్నర కోట్ల రూపాయల కలెక్షన్స్ చేసి,ఏ ఎన్ ఆర్ పైచేయిగా నిలిచాడు. ఈ ఐదేళ్ల కాలంలోనే చిరంజీవి కేరక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా నెట్టుకుంటూ వచ్చాడు. కొన్ని సినిమాల్లో హీరోగా వేయడం మొదలు పెట్టాడు.

ఇక 1983లో ఖైదీ సినిమా ద్వారా చిరంజీవి నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి తెలుగు ఇండస్ట్రీ రికార్డులను తుడిచిపెట్టేసాడు. ఆ తర్వాత ఏ హీరోకి ఈ రికార్డులను చెరిపే ఛాన్స్ రాలేదు. అంతేకాదు, చాలా రికార్డులు ఇలాగే సాధించి ఎవరికి అందనంత ఎత్తులో తనకు తానె సాటిగా నిలిచాడు. 1987లో పసివాడి ప్రాణం మూవీతో నాలుగున్నర కోట్ల కలెక్షన్స్ సాధించి,నాలుగేళ్ల క్రితం నాటి ఖైదీ రికార్డుని అధిగమించాడు. 1988లో యముడికి మొగుడు ఐదు కోట్ల రూపాయలతో కొత్త రికార్డ్ సాధించగా,1989లో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు మూవీతో 5న్నర కోట్లు సాధించాడు.

అయితే అదే ఏడాది ముద్దుల మావయ్య చిత్రంతో ఐదున్నర కోట్లు సాధించి మొదటిసారి చిరుకి బాలకృష్ణ పోటీగా నిలిచాడు. ఇక అదే ఏడాది నాగార్జున శివ మూవీ కూడా రికార్డుస్థాయి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీటి ఆరున్నర కోట్లు సాధించి చిరంజీవి భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక గ్యాంగ్ లీడర్ సినిమాతో మళ్ళీ మెగాస్టార్ ఏడున్నర కోట్ల కలెక్షన్స్ తో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. 90వ దశకం వచ్చేదాకా నేల టికెట్ రూపాయి,బాల్కనీ 5నుంచి 10రూపాయలుండేది.

అందుకే అప్పట్లో ఐదుకోట్ల అంటే ఇప్పుడు వందకోట్లతో సమానం. అక్కడ నుంచి రేట్లు స్వల్పంగా పెరగడంతో మిగిలిన హీరోలకు కూడా రికార్డులు సొంతం అవుతూ వస్తున్నాయి. ఎందుకంటే అదే ఏడాది చంటి సినిమా 9కోట్లు కలెక్షన్స్ సాధించడంతో వెంకటేష్ రేంజ్ టాప్ లోకి వెళ్ళింది. ఇక చిరంజీవి ఘరానామొగుడు తొలిసారి పదికోట్ల మార్క్ క్రాస్ చేసింది. అప్పటికే హిందీలో ఆరు సినిమాలు మాత్రమే పదికోట్ల రేంజ్ కి చేరగా,తమిళంలో అసలు ఆ రేంజ్ కి ఎవరు చేరలేదు.

ఇక మరో మూడేళ్ళ తర్వాత మోహన్ బాబు నటించిన పెదరాయుడు 12కోట్లతో ముందు వరుసలో నిల్చుంది. మరో నాలుగేళ్ళ తర్వాత చిరంజీవి స్నేహం కోసం మూవీ 15కోట్లు సాధించగా, అన్నయ్య మూవీ 18న్నర కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇక చిరు తంమూడ్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా 21కోట్లతో సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. ఇక 2002లో చిరంజీవి ఇంద్ర మూవీతో 33కోట్లకు పైనే కలెక్షన్స్ చేసి, ఇండస్ట్రీ రికాడులను బద్దలు కొట్టాడు. నాలుగేళ్ల పాటు ఈ రికార్డ్ అలాగే ఉంది.

మధ్యలో చిరు ఠాగూర్ 31కోట్లు,జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి 32కోట్లతో నిలిచాయి. ఇలా 8ఇండస్ట్రీ రికార్డులతో అందనంత ఎత్తుకి చేరిన చిరంజీవి తెలుగు సినిమాను హిందీ ,తమిళ సినిమాలకు ధీటుగా తీసుకెళ్లాడని చెప్పవచ్చు. తరవాత రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి,ఖైదీ నెంబర్ 150తో రికార్డులు సృష్టించాడు. ప్రస్తుతం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ వ్యయంతో నిర్మిస్తున్న సైరీ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.