తిరుమలకు వెళుతున్నారా… అయితే ఈ విషయాలను తెలుసుకోండి… లేదంటే
తిరుమల తిరుపతి అనగానే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గుర్తొస్తాడు. కోరిన కోర్కెలు తీర్చే దేవుడుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని కీరిస్తూ నిత్యం లక్షలాది మంది స్వామి ని దర్శించుకుంటారు. భక్తులకోసం ఎన్నో సౌకర్యాలు అక్కడ అమలవుతున్నాయి. ఎన్నో ఉచిత సేవలు కూడా దేవస్థానం అందిస్తోంది. డబ్బున్న వాళ్ళు ఎలాగైనా ఖర్చుపెడతారు. చిన్న చిన్న వాళ్ళకోసం ఉచిత సేవలు పెంచుతూ వస్తోంది. వాటి గురించి తెలుసుకుంటే,పేదలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
తిరుమల కొండకు వచ్చే భక్తులకోసం రైల్వే స్టేషన్,బస్ స్టేషన్ లో ఉచిత బస్సులు అందుబాటులో ఉన్నాయి. అలిపిరి,శ్రీవారి పాదాల మార్గం వైపు ఈ ధర్మరథం బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఈ బస్సులు వస్తుంటాయి. ఇక అలిపిరి,శ్రీవారి మెట్టు దగ్గర నుంచి కొండపైకి వెళ్లాలంటే లగేజి ఇబ్బందిగా ఉంటుంది.
ఈ విషయాన్ని టిటిడి బోర్డు చర్చించి, అలిపిరి,శ్రీవారి మెట్టు దగ్గర నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్ధం ఉచిత లగేజి కౌంటర్లు పెట్టారు. ఈ కౌంటర్ల దగ్గర లగేజి ఇచ్చేసి,మెట్ల మార్గం ద్వారా పైకి చేరేసరికి అక్కడ సిద్ధంగా ఉంటాయి. శ్రీవారి కల్యాణ కట్టలలో గానీ,ఇతర కల్యాణ కట్టలలో గానీ ఉచితంగా జుట్టు తీయించుకోవచ్చు. ఎవరు డబ్బులు ఇవ్వనవసరం లేదు.
ఒకవేళ ఇచ్చినా, తీసుకున్నా సిసి కెమెరాలో రికార్డ్ అవుతుంది. కొండపైన ఆరోగ్య పరంగా ఇబ్బంది లేకుండా ఉండేలా అశ్విని హాస్పిటల్ శ్రీవారి క్యూ కాంప్లెక్స్ దగ్గరలో ఉంది. అలాగే ఇంకా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి,సేవలు అందిస్తున్నారు. ఇక్కడ ఉచిత ప్రాధమిక సేవలు అందించి,వీటికి అనుసంధానంగా అపోలో హాస్పిటల్లో కొందరికి ఉచిత వైద్యం అందుతోంది.
సెల్ ఫోన్లు,చెప్పల్స్, తమ బాగ్స్ ని భద్ర పరుచుకోడానికి ఉచిత లాకర్లు ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రోజుకి లక్షన్నర మందికి ఉచిత భోజనాలు టిటిడి కల్పిస్తోంది. ఉదయం 8గంటల నుంచి రాత్రి 11గంటల వరకూ రుచికరమైన భోజనం అందిస్తున్నారు. ఇక ఉదయం పూట టిఫిన్ సైతం గత రెండేళ్లుగా అందిస్తోంది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కూడా లైన్ లు ఉన్నవారికి ఉచితంగా శ్రీవారి ప్రసాదాలను అందిస్తున్నారు. దాదాపు 15వేలమంది నివసించేందుకు అనువుగా కాటేజ్ లు నిర్మాణం చేసి,బాత్ రూమ్ లు,వాష్ రూమ్ లు,సేద దీరడానికి పెద్ద హాల్స్, లాకర్ లు,ఇలా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మానవ సేవ్,మాధవ సేవ అని నమ్మి,అందుకు అనుగుణంగా టిటిడి కృషి చేస్తోంది.