Movies

స్వయంకృషి లో నటించిన ఈ బాలనటుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?

సాధారణంగా సినిమాల్లో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన చాలా మంది హీరోలుగా రాణించటం చాలా కష్టం అవుతుంది. చాలా అతి కొద్ది మంది మాత్రమే హీరోగా రాణించారు. అయితే సినీ నేపధ్యం ఉన్నవారు బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా సక్సెస్ అవుతున్నారు. వారికి సినీ బ్యాక్ గ్రౌండ్ ప్లస్ అవుతుంది. మహేష్ బాబు,మనోజ్,బాలకృష్ణ,ఎన్టీఆర్ వంటి వారు బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి హీరోగా సక్సెస్ అయినవారే.

అయితే కె.విశ్వనాథ్ దర్శకత్వంలో విజయశాంతి,చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన స్వయంకృషి సినిమాలో చిరు మేనల్లుడుగా మాస్టర్ అర్జున్ నటించాడు.

తాతినేని రామారావు దర్శకత్వంలో కృష్ణ,శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన పచ్చని కాపురం సినిమాలో కూడా నటించాడు. ఈ సినిమాలో కృష్ణ,శ్రీదేవి కొడుకుగా తల్లి తండ్రులు విడిపోతే బాధతో కుమిలిపోయే పాత్రలో అద్భుతంగా నటించాడు.

ఆ తర్వాత శోభన్ బాబు,సుహాసిని,ప్రీతి కాంబినేషన్ లో వచ్చిన ఇల్లాలు ప్రియురాలు సినిమాలో చాలా అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో ఎన్నో బాధలు పడే పాత్రలో అద్భుతంగా నటించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసాడు. అందరు గోప స్టార్ నటుడు అవుతాడని భావించారు.

కానీ ఆ తర్వాత సినిమాల్లో కన్పించలేదు. సినిమాల్లో ఎటువంటి సపోర్ట్ లేకుండా నిలదొక్కుకోవడం కష్టమని భావించిన అయన ఉన్నత చదువులు చదివి అమెరికాలో పెద్ద డాక్టర్ గా స్థిరపడ్డారు. అలాగే సంగీతం నేర్చుకొని గజల్స్ పాడటం మరియు సంగీత కచేరీలు ఇస్తూ బిజీగా ఉన్నాడు.