కార్తీక అమావాస్య నుండి ఈ రాశుల వారి జాతకం మారబోతుంది… నక్క తోక తొక్కినట్టే
కార్తీక మాసంలో బహుళ అమావాస్య తిధి కలిగి ఉన్న రోజును కార్తీక అమావాస్య అని అంటారు. ఈ అమావాస్య రోజు నుంచి 4 రాశుల వారి జాతకం మారబోతుంది. ఏదైనా పని సానుకూలంగా ఉండాలంటే చంద్రుని అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. ఎంత ప్రావీణ్యం ఉన్నా ఎన్ని తెలివితేటలూ ఉన్నా సరే కొందరి జీవితాలు ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టు ఉంటాయి. వారి జీవితంలో ఎటువంటి ఎదుగుదల ఉండదు. దీనికి కారణం చంద్రుడు అనుగ్రహం లేకపోవటమే. చంద్రుని అనుగ్రహం ఉంటే పనులు అన్ని సానుకూలంగా అవ్వటమే కాకుండా వారు ఎదుటివారిని బాగా ఆకర్షిస్తారు.
చంద్రుని అనుగ్రహం ఎక్కువగా ఉన్నవారిలో మనోధైర్యం ఎక్కువగా ఉండి ఏ రంగంలో నైనా రాణిస్తారు. చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది. మిగతా గ్రహాల అనుకూలత లేకపోయినా చంద్ర గ్రహ అనుకూలత ఉంటే చాలు జీవితంలో రాణించటానికి. ఒకవేళ చంద్ర గ్రహ అనుకూలత లేకుండా మిగతా గ్రహాల అనుకూలత ఉన్నా పెద్దగా ఉపయోగం ఉండదు. ఇప్పుడు చెప్పబోయే రాశుల వారికి ఈ కార్తీక అమావాస్య నుండి చంద్రుని అనుగ్రహం పూర్తిగా ఉండబోతుంది. ఆ రాశుల గురించి వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి
మేష రాశివారు చంద్రుని అనుగ్రహం కారణంగా ఎన్నో మంచి ఫలితాలను పొందబోతున్నారు. ఉద్యోగం అయినా వ్యాపారం అయినా ఏ రంగంలో ఉన్న సరే మంచి ప్రోత్సాహం ఉంటుంది. ఈ రాశివారు ఆర్ధికంగా కూడా మంచి స్థితిలో ఉంటారు. ఈ రాశి వారు ఏదైనా పని చేసేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు పూర్తీ పరిజ్ఞానము ఉంటేనే మాట్లాడాలి. ఈ గ్రహ స్థితి కారణంగా ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. అంతేకాక ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తి అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేయటానికి మంచి సమయంగా ఉంటుంది.
మిధున రాశి
ఈ రాశివారు ప్రతి పనిలోనూ చాలా దైర్యంగా ముందడుగు వేస్తారు. ఈ రాశివారు ఏ పని చేసిన వాయిదా వేయకుండా చేస్తారు. అంతేకాక వీరిని ఎవరు తప్పుపట్టారు. ఎందుకంటే వీరు ప్రతి విషయంలోనూ చాలా ఫర్ఫెక్ట్ గా ఉంటారు. ఈ రాశివారు కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడతారు. చంద్ర గ్రహ స్థితి కారణంగా అన్ని ఆలోచనలు ఫలవంతం అవుతాయి. మీ నమ్మకాలు అన్ని నిజం కావటంతో చాలా సంతోషంగా ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ గ్రహ స్థితి కారణంగా మిధున రాశివారికి చాలా గొప్పగా ఉండబోతుంది.
తుల రాశి
తుల రాశివారికి కార్తీక అమావాస్య నుండి మంచి కాలం ప్రారంభం అయిందని చెప్పవచ్చు. ఈ రాశివారు ఖర్చు పెట్టె విషయంలో ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. అయితే చంద్ర గ్రహ స్థితి కారణముగా ఈ రాశివారు పెట్టె ఖర్చు అసలు వృధా కాదు. కుటుంబ సభ్యులతో ఉన్న అభిప్రాయం భేదాలు తొలగిపోతాయి. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. మీరు పాత స్నేహితులను కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఈ రాశివారికి చంద్ర గ్రహ స్థితి కారణంగా మంచి ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలను సక్సెస్ గా అమలు చేసి విజయవంతం అవుతారు.
మకర రాశి
ఈ రాశివారికి కార్తీక అమావాస్య నుండి ప్రతి విషయంలోనూ ఒక క్లారిటీ వస్తుంది. ప్రతి విషయంలోనూ స్పష్టంగా ఉంటారు. అలాగే నిర్ణయాలు తీసుకోవటంలో కూడా త్రొట్రుపాటు ఉండదు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. వీరు చేసే ప్రతి ఆలోచన నలుగురిలో ప్రత్యేకంగా ఉండేలా చేస్తుంది. అంతేకాక ఈ మకర రాశివారు ఎదుటివారు చెప్పే విషయాలను గుడ్డిగా నమ్మకుండా కాస్త అలోచించి అడుగు ముందుకు వేస్తారు. ఆర్ధిక వ్యవహారాల్లో చాలా తెలివిగా వ్యవహరిస్తారు.