లవకుశ చిత్రం లో లవకుశలు గా నటించిన ఆ చిన్నారులు ప్రస్తుతం ఎలా వున్నారో?ఏమి చేస్తున్నారో తెలుసా?
సాధారణంగా సినిమాల్లో బాలనటులుగా ప్రవేశించి అందరిని ఆకట్టుకుంటారు. ఆలా వచ్చినవారు అందరూ చివరి వరకు కొనసాగలేదని చెప్పాలి. చాలా కొంతమంది మాత్రమే బాలనటులుగా వచ్చి హీరో,హీరోయిన్స్ గా స్థిరపడ్డారు. 1963 లో మొట్టమొదటిసారి తెలుగు ఫుల్ లెన్త్ కలర్ సినిమాగా వచ్చిన సినిమా ‘లవకుశ’. ఈ సినిమాకి సంబందించిన మరొక విశేషం ఏమిటంటే ఈ సినిమా చూడటానికి ఎడ్ల బండి మీద వచ్చేవారు. ఒకవేళ టికెట్స్ దొరక్కపోతే అక్కడే ఉండి వండుకొని తిని టిక్కెట్స్ దొరికాక చూసి మరి వెళ్లేవారట.
ఈ సినిమాలో ఎన్టీఆర్,అంజలీదేవి,కాంతారావు వంటి ఎందరో మహానటులతో పాటు వారితో పోటాపోటిగా లవకుశ పాత్రలో నటించిన పిల్లలు నటించారు. ఆ పిల్లలే ఆ సినిమాకి హైలెట్ అని చెప్పాలి.
అప్పట్లో ఎన్టీఆర్,అంజలీదేవి తర్వాత అంతలా గుర్తుండిపోయిన పాత్రలు లవుడు,కుశుడు. లవుడిగా మాస్టర్ నాగరాజు,కుశుడుగా మాస్టర్ సుభ్రహ్మణ్యం నటించారు.
మాస్టర్ నాగరాజు అసలు పేరు నాగేంద్రరావు. అతని తండ్రి పేరు A.V. సుబ్బారావు. ఆతను కూడా తెలుగులో గొప్ప నటుడు. అయన కీలుగుర్రం,హరిశ్చంద్ర వంటి సినిమాల్లో నటించాడు. మాస్టర్ నాగరాజు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా భక్త రామదాసు సినిమాలో నాగయ్య కొడుకుగా నటించాడు.
ఆ సినిమా ఘన విజయం సాధించటంతో వరుస అవకాశాలు మాస్టర్ నాగరాజుకు వచ్చాయి. ఆలా వచ్చిన అవకాశమే లవకుశలో లవుడు పాత్ర. కుశుడు పాత్రధారి మాస్టర్ సుబ్రహ్మణ్యం కాకినాడలో పుట్టాడు.
మాస్టర్ సుబ్రహ్మణ్యం తండ్రి,తమ్మడుతో కలసి నాటకాలు వేసేవాడు. అప్పట్లో వీరు వేసే లవకుశ నాటకంలో లవకుశులు వీరు పెట్టింది పేరు. లవకుశ నాటకంలో కుశుడుగా వేసిన సుబ్రహ్మణ్యం నటనను చూసి దర్శకుడు పుల్లయ్య వెంటనే లవకుశ సినిమాలో కుశుడుగా సెలక్ట్ చేసేసాడు.
సినిమా విడుదల అయ్యి ఘన విజయం సాధించటంతో లవకుశులుగా వేసిన నాగరాజు,సుబ్రహ్మణ్యంలకు మంచి పేరు వచ్చింది. సినిమా నిర్మాణం 5 సంవత్సరాలు పట్టటంతో వారు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించే వయస్సును దాటిపోయారు.
మాస్టర్ సుబ్రహ్మణ్యంకు ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోవటం, మరొక పక్క చైల్డ్ ఆర్టిస్ట్ గా పనికిరాకపోవటంతో ఎటువంటి అవకాశాలు రాకపోవటంతో తన కుటుంబాన్ని పోషించటం కోసం కాకినాడలోని గొల్లపల్లి అనే గ్రామంలో టైలర్ గా పనిచేస్తున్నాడు.
మాస్టర్ నాగరాజుకి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండుట వలన దాదాపుగా 300 సినిమాల వరకు నటించాడు. అతనికి చిన్న వయస్సులోనే పెళ్లి అయింది. అతనికి ముగ్గురు కూతుళ్లు,ఒక కొడుకు. అన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఏమి ఆస్తులు కూడబెట్టలేకపోయాడు.
నాగరాజు ఉన్న కొద్దిపాటి ఆస్తిని అమ్మేసి పిల్లల చదువు,పెళ్లిళ్లు చేసి, ప్రస్తుతం గాంధీనగర్ లో షిరిడి సాయిబాబా గుడిలో పూజారిగా బ్రతుకు వెళ్లబుచ్చుతున్నారు.