Movies

కమెడియన్ అలీ గురించి మనకు తెలీని నమ్మలేని నిజాలు పిల్లలు ఏమి చేస్తున్నారో తెలుసా?

తెలుగు తెరపై ఎందరో కమెడియన్స్ ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ . అందులో అలీది కూడా ఓ వినూత్న శైలి. డిఫరెంట్ పదాల ప్రయోగంతో కామెడీ పండిస్తున్న నటుడు అలీ చైల్డ్ ఆర్టిస్టు నుంచే సినీ రంగంలో అంచెలంచెలుగా ఎదిగాడు. యమలీల మూవీతో స్టార్ హీరో కూడా అయ్యాడు. యాంకర్ గా కూడా తనదైన శైలిలో పలు షోలు నిర్వహించాడు. యంద చేట, కాట్రవల్లీ,అక్కుమ్ బక్కుమ్,జంబల్ హాట్, జలగండ్రి వంటి ఎన్నో వినూత్న పదాలను పుట్టించి,కామెడీకి కొత్త అర్ధం చెప్పాడు. 1967అక్టోబర్ 10న రాజమండ్రిలో జన్మిచిన అలీ చిన్న నాటినుంచే ఎన్టీఆర్ ,ఏ ఎన్ ఆర్ లాంటి నటులను ఇమిటేట్ చేస్తూ,అందరిని నవ్వించేవాడు. అలా చిన్నప్పటినుంచి కమెడియన్ గా ఉంటూ,చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా కామెడీ పండిస్తూ నవ్వుల తోటగా విరబూసాడు.

జీవనాధారం కోసం పొట్ట చేత్తో పట్టుకుని చిన్నప్పుడే మద్రాసు చేరిన అలీ కమెడియన్ గా బాగా రాణిస్తున్న అలీ ని హీరోగా పరిచయం చేసి, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కొత్త ప్రయోగం చేసాడు. మొదట్లో అలీ హీరో ఏంటి అన్నవాళ్ళే తీరా సినిమా చూసాక ఔరా అనుకున్నారు. ఆవిధంగా స్టార్ కమెడియన్ స్టార్ హీరో అయ్యాడు. యమలీలతో అలీ నటన అందరిని ఆకట్టుకుంది. అందుకే వరుసగా హీరో ఛాన్స్ లు వచ్చి పడ్డాయి.

ఇదే సినిమాను వెంకటేష్ తాకదీర్ వాలా గా రీమేక్ చేసారు. కొత్తవాళ్లు వస్తుంటే పాతవాళ్లకు ఇబ్బందులు వస్తాయి. ఛాన్స్ లు తగ్గుతాయి. కానీ కాల్ షీట్స్ ఖాళీ లేకుండా కెరీర్ సాగుతున్న కొద్దిమందిలో అలీ ఒకడు. ఇక కొన్ని రకాల పాత్రలు వేయాలంటే అలీ మాత్రమే చేయగలడని ఆడియన్స్ కూడా బలంగా చెబుతారు.

చిరుత మూవీలో మై నేమ్ ఈజ్ లచ్మి అంటూ చేసిన నటన చూసి రిపీట్ ఆడియన్స్ వచ్చారంటే అలీ రేంజ్ అర్ధం చేసుకోవచ్చు. వాసు సినిమాలో రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకున్నాడు. 2003లో అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి,2005లో సూపర్ మూవీ లలో నవ్వుల పంట పండించినందుకు రెండు సార్లూ కూడా ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్నాడు. తమ్ముడు ఖయ్యుమ్ కూడా నటుడే.

అలీ భార్య సుబేదా సుల్తానా బేగం. ఇక వీరికి ఇద్దరు కూతుళ్లు,ఓ కొడుకు. పెద్దమ్మాయి ఫాతిమా ,రెండో అమ్మాయి జువేరియా,కొడుకు సుభాన్. కాగా అలీ తల్లి ని,పిల్లలను కూడా అలీ భార్య బాగా చూసుకుంటూ , అలికి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. అటు ఇటు కాని పాత్రలకు పెట్టింది పేరని చెప్పాలి. కమెడియన్ గా బిజీ గా ఉంటూ కూడా టివి షోలలో కూడా తన సత్తా చాటుతున్నాడు. అయితే పెద్ద కూతురు గ్రాడ్యుయేషన్ చేస్తోంది. నటి కావలసిన లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మరి ఇండస్ట్రీకి పరిచయం చేస్తాడో లేదో చూడాలి.