లలితా జ్యుయలర్స్ అధినేత కిరణ్ కుమార్ గురించి బయటపడిన నమ్మలేని నిజం
తెలంగాణా ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇక లెక్కింపు సమయం దగ్గర పడింది. ఈ ఎన్నికల ప్రభావం దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికలపై ముఖ్యంగా ఏపీపై పడనున్నాయి. అందుకే ఏపీలో చురుగ్గా రాజకీయాలు నడుస్తున్నాయి. పార్టీలు మారడం, టికెట్స్ రిజర్వ్ చేసుకోవడం,సరంజామా సిద్ధం చేసుకోవడం వంటి పనుల్లో అందరూ వ్యూహాలు రచిస్తున్నారు. కొత్తవాళ్లు,వ్యాపార వేత్తలు కూడా రాజకీయాల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా లలితా జ్యుయలర్స్ అధినేత కిరణ్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ఈయన వైకాపా టికెట్ ఆశిస్తున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికి తోడు పాదయాత్ర సాగిస్తున్న వైఎస్ జగన్ ని కిరణ్ కుమార్ కలుసుకుని ఏదో చర్చించినట్లు తెలుస్తోంది. నెల్లూరు నుంచి బరిలో దిగుతాడని అంటున్నారు.
ఇక రాష్ట్రంలో లలితా జ్యుయలర్స్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బంగారు షాపులకు సంబంధించి కొత్తకొత్త నగలతో ఆకర్షించడంలో లలితా జ్యుయలర్స్ పెట్టింది పేరు. ఇక పూర్తి గుండుతో కనిపించే కిరణ్ కుమార్ స్వయంగా యాడ్స్ లో నటించడం, ఆ ప్రకటనలు టీవీల్లో ఊదర గొట్టడం తెల్సిందే . నిజానికి ఈయన రాజస్థాన్ కి చెందిన వ్యక్తి.
అయితే ఆయన పేరెంట్స్ ఎప్పుడో పొట్ట చేత్తో పట్టుకుని నెల్లూరు వచ్చారు. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా, తల్లి చేతికి గల రెండు గాజలను కరిగించి వెరైటీ డిజైన్లతో తయారు చేయించి వాటిని చెన్నైలోని లలితా జ్యుయలర్స్ కి చూపించాడు. అవి అమ్మకానికి పెడితే ,మంచి డిమాండ్ వచ్చింది. దీంతో కిరణ్ కుమార్ క్రియేటివిటీకి మెచ్చుకుని మరికొన్ని డిజైన్లకు ఆర్డర్ ఇచ్చారు.
ఇలా వచ్చిన ఛాన్స్ ని కిరణ్ కుమార్ ఉపయోగించుకుని, రోజుకి 18గంటలు శ్రమించి కొత్త డిజైన్స్ రూపొందించేవాడు. ఆవిధంగా ఇతడికి కొంత డబ్బు ముట్టేది . ఇక కొన్నాళ్ళకు లలితా జ్యుయలర్స్ కి నష్టాలు రావడంతో షాపు అమ్మేయాలని ఓనర్స్ భావించారు. విషయం తెలిసిన కిరణ్ కుమార్ తన దగ్గర గల సొమ్ముతో షాప్ ని సొంతం చేసేసుకున్నాడు. ఇక తెలివితేటలు పుష్కలంగా ఉండడంతో షాపులు పెరుగుతూ అన్ని రాష్ట్రాలకు విస్తరించాయి. ఇప్పుడు 10వేల కోట్ల బిజినెస్ కి చేరుకున్నారు.
సంపాదనలో కొంతమొత్తాన్ని సొంత ఊళ్ళో పాఠశాల నిర్మాణం ,రోడ్లు కోసం వెచ్చించాడు. ఇక జగన్ తో సమావేశం కావడంతో రాజకీయ ప్రవేశం గురించే అంటూ సర్వత్రా చర్చకు దారితీసింది. కష్టపడి పైకి వచ్చిన కిరణ్ కుమార్ కి సీటు ఇవ్వాలని జగన్ అనుకుంటున్నట్లు తెలియ వచ్చింది.