Movies

ఒకప్పుడు వీళ్లకి డబ్బింగ్ ఎవరు చెప్పారో తెలుసా ?

నటుడికి నటనతో పాటు బాష కూడా ముఖ్యమే. అందుకే ఒక్కో నటుడికి ఒక్కో రకమైన గాత్రంతో అలరిస్తూ ఉంటారు. తెలుగులో జగ్గయ్య,S.V.రంగారావు,గుమ్మడి,దూళిపాళ,P.J.శర్మ,రావుగోపాలరావు, కృష్ణ,మోహన్ బాబు,శోభన్ బాబు వంటి వారు వారి డబ్బింగ్ వారే చెప్పుకొనేవారు. అయితే కొంతమందికి వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పుతారంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే.

రావుగోపాలరావు మొదటి సినిమా ‘జగత్ కిలాడీలు’ లో విలన్ గా పూర్తి స్థాయిలో నటించారు. కానీ డబ్బింగ్ మాత్రం వేరేవాళ్ళ చేత చెప్పించారు.

గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి ఆరోగ్యం బాగోలేనప్పుడు నటించిన సినిమా ఆయనకు ఇద్దరు సినిమాకి నూతనప్రసాద్ చేత చెప్పించారు.

జగపతి బాబు కెరీర్ మొదట్లో చేసిన సినిమాలకు S.P.బాలసుబ్రమణ్యం, ఘంటసాల రత్న కుమార్ డబ్బింగ్ చెప్పారు. అడవిలో అభిమన్యుడు,పెద్దరికం ఇందుకు ఉదాహరణ. బాలుగారు జగపతి బాబుతో ని స్వరం బాగుంటుందని నీవే డబ్బింగ్ చెప్పమని బలవంతం చేయటంతో ‘గాయం’ సినిమాకి జగపతి బాబు చెప్పుకున్నాడు. ఆ సినిమా హిట్ అవ్వటంతో తన డబ్బింగ్ తానే చెప్పుకుంటున్నాడు.

తెలుగులో ప్రకాష్ రాజ్ మొదటి సినిమా సంకల్పం. ఆ తర్వాత వచ్చిన స్నేహం కోసం సినిమాలో కూడా రవి శంకర్ తో డబ్బింగ్ చెప్పించారు.