ఒకప్పుడు టాలీవుడ్ ని ఒక ఊపు ఊపిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
హీరో హీరోయిన్స్ గా రాణించిన వాళ్లలో కొందరు కొన్నాళ్ల తర్వాత ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో కూడా తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. కొందరైతే మరీ ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు. ఇలా రకరకాల పరిస్థితులు చూస్తుంటాం. కొందరైతే వ్యక్తిగత జీవితాన్ని సరిగ్గా దిద్దుకోలేరు. అలాంటి వాళ్లలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ మనీషా కొయిరాలా ఒకరు. ఈమె జీవితంలో వచ్చిన ఆటుపోట్లు తట్టుకోలేక జీవితం దారుణం అయిపొయింది. బాలీవుడ్ లోనే కాక టాలీవుడ్ లో కోలీవుడ్ లో కూడా ఎన్నో చిత్రాల్లో నటించిన ఈమె తెలుగులో నాగార్జున తదితరులతో నటించి మంచిపేరు తెచ్చుకుంది.
నేపాలీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మనీషా తండ్రి ప్రభాకర్ కొయిరాలా మినిష్టర్. తల్లి సుష్మ కొయిరాలా గృహిణి. ఇక ఈమె తాత ఒకప్పుడు నేపాల్ ప్రధాని గా చేసారు. రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే, తొలినుంచి ఢిల్లీలో అమ్మమ్మ దగ్గర పెరిగింది. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన మనీషా 1991లో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
సౌదాగర్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ పెద్దగా ఆడకపోయినా,ఆ తర్వాత వచ్చిన 1942 ఐ లవ్ స్టోరీ యావత్ భారత దేశాన్నే ఓ ఊపు ఊపేసి,ఆమె కెరీర్ ని తారాస్థాయికి చేర్చేసింది. ఇక దాంతో తెలుగు,కన్నడ,మళయాళ, తమిళ సినిమాల్లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.
తెలుగులో బాంబే , క్రిమినల్,భారతీయుడు వంటి అతికొద్ది మూవీస్ లోనే నటించినా అన్నీ బ్లాక్ బస్టర్ అయ్యాయి.
ఇక సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన నేపాలీ బిజినెస్ మ్యాన్ సామ్రాట్ దహాల్ ని ప్రేమించి పెళ్లిచేసుకుంది. పెళ్లి జీవితాన్ని మలుపు తిప్పుతుందని అనుకుంటాం గానీ, ఈమె జీవితంలో దారుణమైన పరిస్థితులను తెచ్చిపెట్టింది. రెండేళ్లకే వారి మధ్య తేడాలు వచ్చేసాయి. భర్త నుంచి కష్టాలే కాదు,ప్రాణాన్ని హరించే కాన్సర్ బారిన పడింది.
అమెరికాలో ట్రీట్ మెంట్ తీసుకుంది. అ సమయం ఆమెను ఆధ్యాత్మికత వైపు నడిచేలా చేసింది. దాంతో మోటివేషన్ స్పీచెస్ ఇస్తూ జీవితాన్ని వైరాగ్యానికి అంకితం చేసేసింది. అసలు ఆనవాలు కట్టలేనంతగా మారిపోయింది. జీవితంలోని ఆటుపోటులే ఆమెను మరోవైపు నడిపించాయి. ఇది నిజంగా గ్రేట్.