ముక్కోటి ఏకాదశి నుండి దశ మారి కుబేరులు కాబోతున్న రాశులు…మీ రాశి ఉందేమో చూసుకోండి
ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం ద్వారా విష్ణు మూర్తి దర్శనం ఇస్తారు. ఆ రోజున విష్ణు ముర్తి దర్శనం చేసుకున్నవారికి సకల పాపాలు తొలగిపోయి పుణ్య లోకాల ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెపుతున్నాయి. అలాంటి ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు నుంచి మూడు రాశుల వారి దశ తిరగబోతుంది. మనలో చాలా మంది జాతకాలను నమ్ముతూ ఉంటారు. డిసెంబర్ 18 మంగళవారం ముక్కోటి ఏకాదశి నుండి కొన్ని రాశుల వారి దశ మారి అదృష్ట జాతకులుగా మారబోతున్నారు.
కార్తీకమాసం పూర్తి అయ్యి మార్గశిర మాసం వచ్చేసింది. ఈ మార్గశిర మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి కొన్ని రాశుల వారికీ అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. గ్రహ సంచారంలో కొన్ని మార్పుల కారణంగా ఈ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. సూర్యుడు 12 రాశులను చుట్టి రావటానికి ఒక సంవత్సరం పడుతుంది. అంటే ఒక్కో రాశిలో సూర్యుడు ఒక నెల పాటు ఉంటారు. కానీ చంద్రుడు మాత్రం ఒక్క నెలలోనే 12 రాశులను చుట్టేస్తారు.
అయితే చంద్రుడు ఏ నెలలో ఏ రాశిలో ఉంటారో చెప్పటం కష్టమైన విషయమే. చంద్రుడు ఒక్కో రోజు ఒక్కో నక్షత్రానికి దగ్గరగా వస్తాడు. నక్షత్రాలు 27 ఉంటాయి. ఇలా నక్షత్రాలను చుట్టి వస్తే 12 రాశులను చుట్టేసినట్టే. ఈ ముక్కోటి ఏకాదశి నుండి మూడు రాశుల వారికి అనుకూలంగా ఉందని పండితులు చెప్పుతున్నారు.
తులారాశి
తులారాశికి అధిపతి శుక్రుడు. వీరు నిర్ణయించుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కలిసి వస్తుంది. ముక్కోటి ఏకాదశి తర్వాత ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి దైవం అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసిన వీరు విజయవంతం అవుతారు. వ్యాపారం చేసే వారిలో స్థిరత్వం లేనివారు కాస్త శ్రద్ద పెడితే వ్యాపారం వృద్ధిలోకి వచ్చి మంచి లాభాలను గడిస్తారు. వీరిలో నాయకత్వ లక్షణాలు ఉండుట వలన అందరిలో మంచి పేరు సంపాదిస్తారు.
మకర రాశి
మకర రాశివారికి అధిపతి శనిదేవుడు. ఈ ముక్కోటి ఏకాదశి తర్వాత ఈ మకరరాశి వారికి బాగా కలిసి వస్తుంది. గ్రహ స్థితిలో వచ్చే మార్పుల కారణంగా వీరు ఏ పని చేసిన ముందడుగు పడుతుంది. ఉద్యోగం లేనివారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే కాస్త శ్రద్ద పెట్టవలసి ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి బాగా కలిసివస్తుంది. అప్పుల బాధలు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. విద్యార్థులకు మంచి సమయం. వారి కష్టానికి ఫలితం దక్కుతుంది. మకర రాశివారు శివుణ్ణి,విష్ణువుని పూజించటం ద్వారా మరిన్ని అద్భుతమైన ఫలితాలను పొందుతారు.
సింహ రాశి
సింహ రాశివారికి అధిపతి సూర్యుడు. ఈ రాశివారు ఈ సమయంలో ఏమి చేసిన బాగా కలిసివస్తుంది. కొత్త పనులను మొదలు పెట్టవచ్చు. గృహ నిర్మాణాలను పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు బాగా కలిసివస్తుంది. వ్యాపారంలో మంచి వృద్ధి కలిగి మంచి లాభాలు వస్తాయి. ఎప్పుడో ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలో చేస్తే అన్ని పనులు పూర్తి అవుతాయి. సింహ రాశివారు శివుణ్ణి,ఆంజనేయ స్వామిని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకొని ఉపవాసం ఉంటే విష్ణువు యొక్క అనుగ్రహం కలిగి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి.