Movies

వరుణ్ రాజ్ అసంతృప్తి వెనుక అసలు కారణం ఇదే… ఇప్పుడు ఎక్కడ ఏమి చేస్తున్నాడో తెలుసా?

హీరో హీరోయిన్స్,నటీనటులు సినిమాల్లో రాణించాలంటే వారికి బ్రేక్ రావాలి. అదే టర్నింగ్ పాయింట్. ఇందుకోసం రచయితలూ,దర్శకులు కసరత్తు చేసి,నటీనటులకు తగ్గ పాత్రలను రూపకల్పన చేస్తే, అప్పుడు అవి జనరంజకం అవుతాయి. మంచి బ్రేక్ వస్తుంది. ఎందరో దర్శకులు ఇలా పనిచేయడం వల్లనే హీరో హీరోయిన్స్,నటీనటులకు బ్రేక్ వచ్చి స్టార్స్ అయ్యారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, తెలుగులో చిరంజీవి ఎలా బ్రేక్ డాన్స్ లను పరిచయం చేసి రాణించాడో అలాగే మళయాళంలో కూడా వరుణ్ రాజ్ అప్పట్లో బ్రేక్ డాన్స్ లతో అదరగొట్టాడు. ఇతడి అసలు పేరు శశిక్ తల్వంగే.

వరుణ్ రాజ్ తో పాటు సంజయ్ అనే పేరుకూడా ఉంది. పలు భాషల్లో సక్సెస్ అయినప్పటికీ తెలుగులో రాణించలేకపోయాడు. అవును హాస్య బ్రహ్మ జంధ్యాల డైరెక్షన్ లో ఇష్ గప్ చిప్ మూవీలో భానుప్రియ సరసన వరుణ్ రాజ్ నటించాడు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అలాగే వరుణ్ రాజ్ కి పేరు కూడా రాలేదు. ఇక వరుణ్ రాజ్ గే అని అప్పట్లో రూమర్స్ చక్కర్లు కూడా కొట్టాయి. ఇక నిజానికి ప్రదీప్,నరేష్,కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం,మోహన్,సుత్తివేలు,సుత్తి వీరభద్రరావు,పూర్ణిమ,రాజ్యలక్ష్మి,తులసి,శ్రీలక్ష్మి ఇలా చాలామందికి జంధ్యాల నటనలో స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టారు.

అలాగే ధర్మవరపు సుబ్రహ్మణ్యం,విద్యాసాగర్,రత్నా సాగర్ వరకూ ఇలా ఇంకా చాలామంది జంధ్యాల ఇచ్చిన బ్రేక్ తోనే నిలదొక్కుకున్నారు.
కానీ వరుణ్ రాజ్ కి తెలుగులో బ్రేక్ ఇవ్వాలని తపించి ఇవ్వలేకపోయారు. ముంబయిలో జన్మించిన యితడు 1998నుంచి 2016వరకూ సినీ పరిశ్రమలో యాక్టివ్ గా ఉన్నాడు. మళయాళం లో వచ్చిన లవ్ స్టోరీస్ చిత్రం బాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా పేరుతెచ్చింది. లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న యితడు డాన్సింగ్ కింగ్ గా పేరుతెచ్చుకున్నారు.

తమిళంలో కొడంగల్ నౌ, కల్పన హౌస్,1986లవ్ స్టోరీస్ చిత్రాల్లో నటించిన యితడు తెలుగులో కాళరాత్రిలో కన్నెపిల్ల,ప్రేమే నా ప్రాణం వంటి చిత్రాల్లో హీరోగా నటించాడు. జంధ్యాల తీసిన ఇష్ గప్ చిప్ చిత్రంలో అలాగే బాలీవుడ్ లో ఖులీ కిడి కిడి మూవీలో చేసాడు. అల్లాణి శ్రీధర్ డైరెక్షన్ లో ఆమని హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రేమే నా ప్రాణం మూవీయే . ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి 2016లో తప్పుకున్న వరుణ్ రాజ్ కోల్ కత్తాలో సెటిల్ అయ్యి, సొంతంగా బిజినెస్ నెలకొల్పి సూపర్ గా సక్సెస్ అయ్యాడు.