మెగా ఫ్యామిలీ మొత్తం ఆస్తుల విలువలో చెర్రీ,ఉపాసనల ఆస్థి ఎంతో తెలుసా?
సినిమాల్లో సంపాదించే సొమ్ము కంటే ,ఆ సొమ్ముని వ్యాపార రంగాల్లో పెట్టుబడులుగా పెట్టి ఎదగడం ఇప్పటి హీరోలకు వచ్చిన గొప్ప వరం. అందుకే ఏటా కోట్లకు కోట్లు వచ్చిపడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి పైసా పైసా కూడబెట్టి,అత్యున్నత స్థాయికి చేరుకుంటే,అయన కొడుకు రామ్ చరణ్ మాత్రం తన ఆదాయాన్ని ఏటా కోటానుకోట్లు పెంచుకుంటూ పోతున్నారు. ఇందుకు అతని భార్య ఉపాసన కారణం. బిజినెస్ కుటుంబం నుంచి వచ్చిన ఆమె లాభదాయక రంగాల్లో పెట్టుబడులు పెడుతూ ఏటా కనీసం 500కోట్ల ఆదాయం పెంచుకుంటూ పోతోంది. స్టార్ హీరోల భార్యలతో స్నేహంగా ఉంటూ,పెట్టుబడులు పెట్టిస్తోంది. ఇక ఇటీవల తమ డ్రీమ్ హౌస్ కోసం 100కోట్లు పెట్టారు.
తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రామ్ చరణ్, టాలీవుడ్ లో రిచ్చెస్ ఫ్యామిలిలో టాప్ 5లో చెర్రీ ఉంటాడు. సినిమాలు చేస్తూ రామ్ చరణ్ ఇప్పటిదాకా సంపాదించింది చాలా తక్కువే. అయితే తండ్రి చిరంజీవికి గల 45వేలకోట్ల ఆస్తిలో మూడు వేల 800కోట్ల వరకూ చెర్రీ పేరుమీద పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఉపాసన కామినేనిని పెళ్లిచేసుకున్నాక ఆమె ద్వారా దశ పట్టింది. పెళ్ళిలో కట్నంగా 350కోట్లు రాగా, విలువైన భూములు ,విల్లాలు కూడా ఉపాసన ద్వారా వచ్చాయి.
అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, అలాగే కామినేని వంటి రాజా వంశస్తుల ఇంటి బిడ్డ అయిన ఉపాసనకు తాత, తండ్రి ద్వారా దాదాపు 2500కోట్లు సంక్రమించాయి. దీంతో చెర్రీ ఆస్థి 10వేలకోట్లకు చేరుతోంది. తన 50ఏళ్లకాలంలో రకరకాల సంస్థల్లో ఇన్వెస్ట్ చేసి, కష్టపడి సంపాదించిన సొమ్ము 45,200కోట్లు. అయితే రామ్ చరణ్ భార్య తాలూకు,స్థిర చర ఆస్తులు కల్పి 2500కోట్లు, ఇక చెర్రీ పేరున మెగాస్టార్ చిరంజీవి 3వేల 800కోట్లు ముట్ట జెప్పారు.
కట్నం గా వచ్చిన సొమ్ము అన్నీ కలిపి పదివేల కోట్లు మార్క్ దాటేశాడు చెర్రీ. ఇక చెర్రీ, ఉపాసనలు కలిపి సినిమాల్లో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాల్లో పెట్టుబడులు పెట్టడంతో పాటు,రెస్టారెంట్స్ వంటి లాభదాయక రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంతేకాదు మహేష్ బాబు,నమ్రతలతో కల్సి విదేశాల్లో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. చిరంజీవికి 45వేల కోట్ల మార్కు దాటడానికి 50ఏళ్ళ వయస్సు పడితే,35ఏళ్లకే చెర్రీ ఆ మార్క్ అందుకోబోతున్నాడు.
మొత్తానికి తన ఆస్తులు పెరగడానికి తండ్రి చిరంజీవి బీజం వేస్తె, ఉపాసన పూర్తిస్థాయిలో కారణమని చాలామంది అంటుంటారు. స్టార్ హీరోల భార్యలతో ఫ్రెండ్ షిప్ చేస్తూ,వాళ్ళతో కల్సి ట్రిప్స్ ప్లాన్ చేస్తూ,బిజినెస్ కోసం కృషిచేస్తోంది. ఇక చెర్రీ సినిమాల్లో ఏటా సంపాదించేది ఏటా 50కోట్లు దాటడం లేదు. అయితే బిజినెస్ ఇన్వెస్ట్ మెంట్ వలన వార్షిక ఆదాయం 300కోట్ల వరకూ ఉంటుంది.