లేడీ యాంకర్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకవుతారు… నెంబర్ వన్ యాంకర్ ఎవరు?
ఒకప్పుడు యాంకరింగ్ అంటే అంతగా తెలీదు. వ్యాఖ్యాత లుగా పెద్ద పెద్ద కవులు, రచయితలూ వ్యవహరించేవారు. ఇక అప్పట్లో దూరదర్శన్ ఒక్కటే ఉండేది. అందుకే యాంకర్ లు పెద్దగా ఉండేవారు కాదు. కానీ ఇబ్బడి ముబ్బడిగా తెలుగులో ఛానల్స్ వచ్చేసాయి. ఈటీవీ, జెమిని,స్టార్ మా,జీ తెలుగు ఇలా ఎన్నో ఛానల్స్ ఉండడంతో యాంకర్ల వ్యవస్థకు మంచి గుర్తింపు వచ్చేసింది. మ్యూజిక్ ఛానల్స్ వచ్చేసాయి. సినీ హీరోయిన్స్ కి ధీటుగా లేడీ యాంకర్లు వుంటున్నారు. అందుకే యాంకరింగ్ వ్యవస్థలో చేరాలని చాలామంది ఇందులోకి వస్తున్నారు. ఇదే వృత్తిగా, ఉపాధిగా చాలామంది యువత ఎంచుకుంటున్నారు.
అయితే అందం,అభినయం, మాటకారితనం,సమయస్ఫూర్తి పుష్కలంగా ఉంటేనే యాంకర్లుగా రాణించగలరు. అందుకే చాలామంది వచ్చినా, నిలదొక్కుకుంది కొందరే. ఇక బుల్లితెర మీదే కాదు, సినీ వేడుకల్లో ముఖ్యంగా ఆడియో రిలీజ్,ప్రీరిలీజ్ ఫంక్షన్స్ లో యాంకర్లు కీలకం అవుతున్నారు. దీంతో రెమ్యునరేషన్ కూడా బాగా మార్పు వచ్చింది.
అందరిలో నెంబర్ వన్ యాంకర్ గా సుమ ఎన్నో ప్రోగ్రామ్స్ తో దూసుకుపోతూ వచ్చింది. ఝాన్సీ,రేష్మి,అనసూయ,శ్యామల,వర్షిణి,మంజూష, ఇలా లేడీ యాంకర్లు చాలామంది వున్నారు. ఎలాంటి కార్యక్రమం అయినా రక్తి కట్టించడంలో సుమకు సాటిలేరెవ్వరు అని చెప్పొచ్చు.మళయాళీ అయినాసరే,తెలుగు గడ్డపై పెరగడంతో తెలుగుపై అద్భుత గ్రిప్ సాధించింది. సినీ ఫంక్షన్స్ లో కూడా దూసుకుపోతున్న సుమ ఒక్కో ఎపిసోడ్ కి రెండున్నర లక్షలు తీసుకుంటోంది.
నిజానికి సుమ సినీ రంగంలో ట్రై చేసినా సక్సెస్ కాలేకపోవడంతో యాంకర్ రంగంలో సెటిల్ అయింది. బుల్లితెరపై తనకు తానే సాటి అనిపించుకున్న సుమ మళ్ళీ సినీ రంగం వైపు చూడలేదు. ఇక యాంకర్లుగా ఎదుగుతున్న వర్షిణి,మంజూష ఒక్కొక్క ఎపిసోడ్ కి 30వేలనుంచి 50వేల రూపాయల వరకు తీసుకుంటున్నారట. ఇక బిగ్గెస్ట్ రియాల్టీ షోలో పాల్గొన్న శ్యామల ఒక్కో ఎపిసోడ్ కి 70వేలు తీసుకుంటోందట.
ఇక జబర్దస్త్ లో యాంకర్ గా చేస్తున్న రేష్మి ఒక్కో ఎపిసోడ్ రేటు లక్షన్నర అయిందంటే ఆమె రేంజ్ అర్ధం చేసుకోవచ్చు. రంగమ్మత్తగా నటించిన అనసూయ సినిమాల్లో నటించడం మొదలుపెట్టాక యాంకర్ గా రేటు పెంచేయడంతో ఆమెకు ఒక్కో ఇపిసోడ్ కి రెండు లక్షల వరకూ ముట్టజెబుతున్నారట.