ఇషా అంబానీ పెళ్ళి చీర ఖరీదు తెలిస్తే దిమ్మతిరుగుతుంది
అంబానీ ఇంట్లో పెళ్లంటే మాటలు కాదు అనేవిధంగా ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిపోయింది. 44వేల బిలియన్ డాలర్ల కు అధిపతి ఏమో అన్నీ ఆ రేంజ్ కి తగ్గట్టుగానే ఉన్నాయి. పెళ్లి కార్డు ఏకంగా ఒక లక్షా 50వేలు ఉంటుందంటే ఆశ్చర్య పోవచ్చు. కానీ నిజం. రాయల్ లుక్ తో కూడిన పెళ్లి కార్డు వెయ్యి మందికి పంచితే,ఆ వచ్చిన జనానికి ఇచ్చిన విందు,కానుకలు అన్నీ లెక్కేస్తే ఖర్చు ఎంతుంటుందో ఊహించుకోండి. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో మూడురోజులపాటు పేదలకు,వికలాంగులకు కొసరి కొసరి వడ్డిస్తూ పంచ భక్ష్య పరమాన్నాలతో భోజనాలు,సినీ సెలబ్రిటీల తళుకులు ఇలా అన్నీ అంబానీ రేంజ్ కి తగ్గట్టుగానే సాగాయి. భువి పై దేవేంద్రుడి మాదిరిగా ముఖేష్ ఈ పెళ్లికోసం ఖర్చు భారీస్ధాయిలోనే పెట్టాడు.
ఇక పెళ్లి బట్టలు చూస్తే,మతి పోతుంది. ఎందుకంటే ఇషా అంబానీ వేసుకున్న డ్రెస్ లకు షోషల్ మీడియాలో ఫాలోయింగ్ దుమ్మురేపుతోంది. దీని గురించే నెటిజన్లు చర్చించుకుంటున్నారు. పెళ్లి గౌను,చీర కోసం ఏకంగా 90 కోట్లు వెచ్చించారట. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ తో డిజైన్ చేసిన గౌనుని బంగారు తీగతో, వజ్రాలు పొదిగి మరీ తయారు చేయించారట. ఇక 24కేరెట్స్ గోల్డ్ తో చీర,జాకెట్టు డిజైన్ చేయించారట.
ఇక అంబానీ కోడలికి కూడా ఇలాంటి చీరె డిజైన్ చేయించారట. ఇది చూసి నెటిజన్లు వామ్మో అంటున్నారు. ఇక ఇంట్లో వాళ్ళ బట్టలు , నగల ధరలు చెప్పక్కర్లేదు. ఇక పెళ్ళికి వచ్చే అతిధులకోసం 50విమానాలు,విమానాశ్రయం నుంచి పెళ్లి వేదికకు చేరుకోవడానికి 200;లేటెస్ట్ కార్లను ఏర్పాటుచేశారట. దీంతో ముంబయిలోని ఛత్రపతి శివాజీ ఎయిర్ పోర్టు ఒక్కరోజులోనే దాదాపుగా ఒక వెయ్యి విమానాలను హేండిల్ చేసిందట. ఇక పెళ్లికోసం ముంబయిలోని ముఖేష్ అంబానీ నివాసాన్ని చేసిన ముస్తాబు ఖర్చు కూడా అదిరిపోయింది.
విదేశాలనుంచి తెచ్చిన పూలతో పందిరిని తీర్చిదిద్దారు. సినీ,రాజకీయ,పారిశ్రామిక,క్రీడా ప్రముఖులు దాదాపు 600మంది అటెండ్ అయ్యారు. ఇందులో అమితాబ్,హిల్లరీ క్లింటన్, రజనీకాంత్,జయాబచ్చన్,అభిషేక్ బచ్చన్,అమీర్ ఖాన్ దంపతులు,ఇలా చాలామంది ప్రముఖులు సందడి చేసారు. ఇక పేదలకు 60రకాల వంటకాలతో మూడు రోజులపాటు ఉదయ్ పూర్ లో భోజనాలు పెట్టి రికార్డు సృష్టించారు. ఇక ఈ పెళ్లికోసం ఏకంగా 700కోట్లు ఖర్చుచేసినట్లు జాతీయ మీడియా లో వార్తలు వస్తున్నాయి.