Movies

మంచు లక్ష్మి జీవితం గురించి మీకు తెలియని ఆసక్తికమైన విషయాలు… తెలిస్తే ఆశ్చర్యపోతారు

మంచు మోహన్ బాబు ఇద్దరు తనయులు విష్ణు,మంచు మనోజ్ లకన్నా కూతురు లక్ష్మి మంచుకు ఎక్కువ క్రేజ్ ఉంది. ఈమెకు ఫాలోవర్స్ కూడా ఎక్కువే . ఈమె మాట్లాడే తెలుగు గురించి కొందరు ఇదేంటి ఇలా మాట్లాడుతోందని కామెంట్స్ చేస్తారు. అయితే ఈమె చెన్నైలో చదివేటప్పుడు అంతా ఇంగ్లీషు మీడియం. ఇక సెకండ్ లాంగ్వేజ్ గా హిందీ తీసుకుంది. దీంతో తమిళం,ఇంగ్లీషు,హిందీ భాషలు వచ్చు. ఇక ఇంట్లో పనివారంతా తమిళం వాళ్ళే. ఇక మోహన్ బాబు షూటింగ్స్ బిజీ వలన ఇంట్లో గడిపే సమయం తక్కువ.

అందుకే మంచు లక్ష్మికి తెలుగు రాయడం,చదవడం రాదు. అయితే వాళ్ళ అమ్మమ్మ పట్టుబట్టి నేర్పించడం వలన ఈమాత్రం అయినా తెలుగు మాట్లాడుతోంది. ఇక ఇంటర్ మీడియట్ హైదరాబాద్ లో చదవడం వలన కొంత తెలుగు వచ్చింది. ఇక ఏదైనా డైలాగ్ ఇస్తే,దాన్ని హిందీలోనో ,ఇంగ్లీషులోనో రాసుకుని అప్పుడు మాట్లాడుతుంది. అందుకే తెలుగు యాసగా ఉంటుంది.

ఈమె హైదరాబాద్ నిట్ స్టూడెంట్ గా ఓ ఫ్యాషన్ డిజైనర్. అందుకే తన కాస్ట్యూమ్స్ ని తానే డిజైన్ చేసుకోవడమో,చెప్పి చేయించుకోవడమే చేస్తుంది. నిజానికి ఈమె ఓ యోగా టీచర్. కానీ ఇండియా వచ్చాక టైం లేకపోవడం వలన ఓ టీచర్ ని పెట్టుకుని ట్రైనింగ్ తీసుకుంటోంది. ఇక మంచు లక్ష్మికి చీర కట్టుకోవడం రాదు.

అయితే జూనియర్ ఎన్టీఆర్ పెళ్ళికి వెళ్ళేటప్పుడు చీర కట్టుకుని వెళ్లిందట. అది చూసి చాలామంది ఫోన్స్ చేసి,మెసేజ్ పెట్టి అభినందించారట. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని చీర కట్టుకోవడం కొనసాగిస్తోంది.ఇక కర్ణాటక సంగీతం కూడా నేర్చుకున్న మంచు లక్ష్మి ,తన సినిమాల్లో పాటలు పాడేస్తోంది. వంట చేయడంలో దిట్ట అయినా బద్దకస్తురాలు కావడం వలన వంట చేయడం మానేసింది.

ఖచ్చితంగా ఆర్టిస్టులకు పేమెంట్ ఇచ్చే కంపెనీలలో మంచు లక్ష్మి ప్రొడక్షన్ హౌస్ నెంబర్ వన్ అని చెప్పాలి. హాలీవుడ్ స్టార్స్ తో కల్సి బుల్లితెర షోస్ చేసింది. ఇక అమెరికాలో ఉండగా చేసిన టివి షోస్ కి చెక్కులు ఇంకా వస్తూనే ఉన్నాయి. పర్సెంట్ వైజ్ పేమెంట్ ఉంటుంది. అందుకే ఎక్కడ ఎప్పుడు టెలికాస్ట్ అయితే అప్పుడు డబ్బులు వస్తాయి. అందుకే ఇప్పటికీ చెక్స్ వస్తూంటాయి. కాగా ప్రతియేటా సంక్రాంతికి తిరుపతి విద్యానికేతన్ కి బంధువులతో కల్సి ఫామిలీ మొత్తం వెళ్లారు. అక్కడ వాళ్ళు మాట్లాడే వెటకారం మాటలంటే మంచు లక్ష్మి ఎంతో సరదా గా ఉంటాయట.