ఈ సినిమాల్లో మీకు తెలియని సీక్రెట్స్
రంగుల ప్రపంచం సినిమా రంగంలో ఒక్కోసారి అనుకోని ఘటనలు జరుగుతూ ఉంటాయి. అవి చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. అయితే దానివెనుక ఏమి జరిగిందో ఆడియన్స్ కి తెలియదు. అందుకే వాటి గురించి ప్రత్యేకంగా చెప్పి తీరాలి. తీరా చెప్పాక ఓహో అదా అని నోరెళ్లబెట్టడం ఖాయం. అవేమిటో చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో వేరే చెప్పక్కర్లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో నాజర్ కేరక్టర్ చాలా గొప్పగా ఉంటుంది. అయితే ఈ కేరక్టర్ వేయాల్సిందిగా అలనాటి అందాల నటుడు శోభన్ బాబు ని అడిగారట. వయస్సు మళ్ళిన కేరక్టర్స్ లో కనిపించేందుకు ఒప్పుకోలేదట. దాంతో నాజర్ కి ఛాన్స్ దక్కింది.
ఇక రవితేజని మాస్ మహారాజా అంటారు కదా. హీరోగా రాకముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. కృష్ణ వంశీ డైరెక్షన్ లో నిన్నే పెళ్లాడుతా నాగార్జునకి టబు జంటగా వచ్చింది. రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. ఇక గమ్యం సినిమాలో అల్లరి నరేష్ కేరక్టర్ చనిపోతుంది. అలా చనిపోయేరోజు షూట్ చేసే రోజున అల్లరి నరేష్ పుట్టినరోజట.
ఇక ఈగ సినిమాలో తాగుబోతు రమేష్ చేసిన కేరక్టర్ అందరిని అలరిస్తుంది. అయితే ఈ సీన్ కోసం రవితేజను పెట్టాలని రాజమౌళి అనుకుని,ఆతర్వాత కామెడీగా ముగించాలని భావించి తాగుబోతు రమేష్ ని తీసుకున్నారట. మన్మధుడు మూవీలో క్లైమాక్స్ లో నాగార్జున నీళ్ళలోకి దూకడానికి భయపడడం సీన్ కదా. అయితే అక్కడ నిజానికి నీళ్ళలోకి దూకడానికి భయపడింది మాత్రం హీరోయిన్ సోనాలి బింద్రే. ఇక ఇటీవల లలితా జ్యుయలర్స్ సంస్థ అధినేత కిరణ్ కుమార్ తరచూ టివిలో యాడ్స్ లో కనిపించడం చూసాం కదా.
అయితే రజనీకాంత్ నటించిన లింగ సినిమాలో జ్యుయలరీ షాప్ ఓనర్ గా కిరణ్ కుమార్ కనిపించాడు. అయితే సినిమాల్లో డైరెక్టర్లు ఒక్కోసారి స్క్రీన్ మీద కనపడాలని అనుకుంటారు. ఇలా చాలామంది డైరెక్టర్లు కనిపించడం మామూలైంది.
అయితే అర్జున్ రెడ్డి సినిమాలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా ఓ సీన్ తళుక్కున మెరుస్తాడు. ముస్సోరిలో చదువుకుంటున్న అర్జున్ రెడ్డి దగ్గరకు ఓ క్యారెక్టర్ వచ్చి ప్రీతి వచ్చిన విషయాన్ని చెబుతాడు కదా అతడే సందీప్ రెడ్డి. అయితే వెనక్కి తిరిగి ఉండిపోయి ఎదురుగా కనిపించకపోవడం వలన మనం అతనెవరో గుర్తించలేం.