జమున చేసింది — వైజయంతిమాల ఎందుకు చేయలేకపోయింది….ఏమిటో చూడండి
టాలీవుడ్ లో అలనాడు అందాల తారగా జమున అశేష అభిమాన జనాన్ని అలరించింది. సావిత్రి తర్వాత ఎన్టీఆర్ , ఏ ఎన్ ఆర్ లతో నటించి, మెప్పించిన నటి ఆమె. శ్రీకృష్ణ సత్య మూవీలో సత్యభామగా ఆమె నటన హైలెట్. పర్సనల్ గా చాలా కఠినంగా వ్యవహరిస్తూ, ముక్కుసూటిగా ఉండడం ఈమె నైజం. దీంతో ఎన్టీఆర్ , ఏ ఎన్ ఆర్ లు కల్సి ఈమెకు ‘పొగరు’అనే ముద్ర కూడా వేసేసారు. ఎక్స్ పోజింగ్ కి అస్సలు ఒప్పుకునేది కాదు. ఇక దొంగల్లో దొర మూవీలో ఏ ఎన్ ఆర్ తో కల్సి జమున నటిస్తున్నప్పుడు రొమాన్స్ సందర్బంగా కాస్త హద్దుమీరి వ్యవహరించడం తో అక్కడికక్కడే చెడా మడా తిట్టిసిందట. సెట్ లో అందరి ముందూ ఆమె ఇలా ప్రవర్తించడంతో ఎన్టీఆర్ , ఏ ఎన్ ఆర్ లు కల్సి ఆమెకు తమ మూవీస్ లో నటించే ఛాన్స్ లు లేకుండా చేసారు. అయితే జగ్గయ్య, కృష్ణరాజు,హరనాధ్ వంటి వారితో కల్సి నటించి తన సత్తా చాటింది. వారితో హిట్స్ కూడా కొట్టింది.
అయితే ఇండస్ట్రీలో ఆనోటా ,ఈనోటా ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు జమున తప్పేం లేదని అన్నారట. దీంతో ఆమెకు ఛాన్స్ లు యధావిధిగా కొనసాగాయి. పైగా ఎన్టీఆర్ , ఏ ఎన్ ఆర్ లు తమ తప్పు కూడా తెలుసుకుని, దిగొచ్చారు. అయితే ఇదే పరిస్థితి బాలీవుడ్ లో వైజయంతి మాలకు కూడా ఎదురైంది. కానీ ఆమె జమున లా వ్యవహరించలేకపోయింది. ఫలితంగా కెరీర్ కి ఫుల్ స్టాప్ పడింది.
ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే, తమిళనాట ఎండి రామన్, వసుంధరాదేవి లకు జన్మించిన వైజయంతి మాల సినీ కెరీర్ ముగించే దశలో చమన్ లాల్ బాలిని వివాహం చేసుకుంది. వీరికి సుచేంద్ర బాలి అనే కుమారుడు ఉన్నాడు. ఈమె మంచి డాన్సర్. గోల్ఫ్ క్రీడలో రాణించింది. కర్ణాటక సంగీత విద్వాంసురాలు. తెలుగులో జీవితం,సంఘం మూవీస్ లో నటించిన ఈమె బాలీవుడ్ లోకి వెళ్లి మొట్టమొదటి మహిళా స్టార్ గా నిల్చింది.
బాహర్,లడఖి,నగీనా, న్యూఢిల్లీ , ఆశా, సంగం వంటి హిందీ చిత్రాలతో పాటు హిందీ దేవదేస్ లో చంద్రముఖి పాత్రను వైజయంతి మాల పోషించింది. ఇక ఈమెకి అప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ తో అలాగే నటుడు,దర్శకుడు రాజ్ కపూర్ తో ఎఫైర్ ఉండేదని అనేవారు. ఇక వీరిద్దరు తమ చిత్రంలో అంటే తమ చిత్రంలో నటించాలని పట్టుబట్టడంతో ఇద్దరి మధ్యా ఆమె నలిగిపోయింది.
దాంతో ఇద్దరికీ ఆమె ఒకే చెప్పేది. దిలీప్ కుమార్ తో లీడర్ సినిమా చేసే సమయంలో రాజ్ కపూర్ సంగం మూవీలో చేయాల్సి రావడంతో ఒప్పుకుంది. ఈ రెండు సినిమాలకు డేట్స్ ఎడ్జెస్ట్ విషయంలో ఇబ్బంది రావడంతో దిలీప్ అంటేనే ఆమెకు ఇష్టమని కొందరు,రాజ్ కపూర్ అంటేనే ప్రిఫరెన్స్ ఇస్తోందని మరికొందరు అనుకునేవారు. ఇక ఇద్దరి మధ్యా పోరు పడలేక సినిమా ఫీల్డ్ కి దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది.
అలా కెరీర్ ముగించాల్సి వచ్చింది. పొలిటీషియన్ గా కూడా పేరు పొందిన ఈమె అమితాబ్ తో కల్సి లోకసభలో ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత రాజ్యసభ సభ్యురాలిగా వ్యవహరించింది. పద్మశ్రీ పురస్కారం భారత ప్రభుత్వం నుంచి అందుకున్న వైజయంతి మాల తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి పురస్కారం స్వీకరించింది.