Movies

టాలీవుడ్ లో అన్నా చెల్లిళ్ళ సెంట్ మెంట్ సినిమాలు

మన తెలుగు సినీ పరిశ్రమలో అన్నా చెల్లిళ్ళ సెంట్ మెంట్ అనేది హిట్ ఫార్ములా. దాదాపుగా అన్నా చెల్లిళ్ళ సెంట్ మెంట్ తో తీసిన సినిమాలు అన్ని హిట్ అయ్యాయి. అప్పటి సీనియర్ రామారావు నుంచి ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఆ ఫార్ములానే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు అన్నా చెల్లిళ్ళ సెంట్ మెంట్ సినిమాల గురించి తెలుసుకుందాం.

రక్త సంబంధం (1962): N.T. రామారావు, సావిత్రి

ఈ సినిమాలో రాజు (ఎన్టీఆర్) మరియు రాధా (సావిత్రి) అన్నా చెల్లిగా నటించారు. కొన్ని కారణాల వలన ఇద్దరూ విడిపోతారు. చివరికి ఇద్దరూ కలిసి చనిపోతారు.

చెల్లేలి కాపురం (1971): శోభన్ బాబు,వాణిశ్రీ

శోభన్ బాబు ఈ సినిమాలో కవిగా నటించాడు. చెల్లెల్లి పెళ్లి కోసం శోభన్ బాబు తన స్నేహితుడు నాగభూషణం పేరు మీద కవితలను రాస్తాడు. శోభన్ బాబు సోదరిని నాగభూషణం పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత కథ ఎన్నో మలుపులు తిరుగుతుంది.

పల్నాటి పౌరుషం (1994): కృష్ణంరాజు, రాధిక

1993 లో తమిళ సినిమా ఆధారంగా తీసారు. కృష్ణం రాజు, రాధిక అన్నా చెల్లిగా నటించారు. ఈ సినిమాలో కృష్ణంరాజుకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడి పురస్కారం (తెలుగు) లభించింది.

హిట్లర్ (1997): చిరంజీవి

ఈ సినిమాలో మెగా స్టార్ చిరంజీవి 5 గురు చెల్లిళ్ళకు అన్నగా నటించాడు. చిరు ఈ సినిమాలో మాధవ్ గా నటించాడు. తన చెల్లిళ్ళను రక్షించటానికి హిట్లర్ గా వ్యవహరిస్తాడు. కథలో బాగంగా చిరు చెల్లిళ్ళకు దూరం అవుతాడు. చివరకు అందరూ కలుస్తారు.

అర్జున్ (2004): మహేష్ బాబు, కీర్తీ రెడ్డి

మీనాక్షి (కీర్తి రెడ్డి) మరియు అర్జున్ (మహేష్ బాబు) కవలలు. మీనాక్షి ఉదయ్ (రాజా) తో ప్రేమలో పడుతుంది. ఉదయ్ తో వివాహం జరుగుతుంది. వివాహం అయ్యాక ఉదయ్ ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళతాడు. ఉదయ్ తండ్రి మరియు తల్లి మీనాక్షిని చంపడానికి ప్రయత్నాలు చేస్తే, అన్న అర్జున్ మీనాక్షిని రక్షించుకుంటాడు.