అతి చిన్న వయస్సులో చనిపోయిన హీరోయిన్స్
తెలుగు సినీ పరిశ్రమలో మంచి విజయవంతమైన సినిమాల్లో నటించి చిన్న వయస్సులోనే చనిపోయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారు చనిపోయి చాలా రోజులు అయినా సరే వారి జ్ఞాపకాలు మనతోనే ఉన్నాయి. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఆర్తి అగర్వాల్ (1984-2015)
అమెరికాలోని అట్లాంటిక్ సిటీ న్యూజెర్సీలో మార్చి 5,1984లో జన్మించింది. ఆమె 14 సంవత్సరాల వయస్సులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టి 2001 వ సంవత్సరంలో బాలీవుడ్ లో పాగల్పాన్ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. వెంకటేష్ తో జోడి కట్టి ‘నువ్వునాకు నచ్చావ్’ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆమె అగ్ర నటుల నుంచి యువ నటుల వరకు అందరితోను జోడి కట్టింది. ఆర్తీ అమెరికా తగ్గటానికి చేయించుకున్న సర్జరీ వికటించడంతో గుండెపోటు వచ్చి జూన్ 6, 2015 న మరణించింది.
2. దివ్యభారతి (1974-1993)
దివ్య భారతి మహారాష్ట్రలో ఫిబ్రవరి 25, 1974 న జన్మించింది. ‘బొబ్బిలి రాజా’ సినిమా ద్వారా సినీ రంగానికి పరిచయం అయ్యి ఆ తర్వాత ‘విశ్వాత్మ’ సినిమా ద్వారా బాలీవుడ్ కి వెళ్ళింది. ఈమె దాదాపుగా 14 సినిమాల్లో నటించింది. ఏప్రిల్ 1993 లో 19 ఏళ్ళ వయస్సులో అనుమానాస్పదంగా మరణించింది. ఇప్పటికీ ఆ మిస్టరీ సంగతి తెలియలేదు.
3. సౌందర్య ( 1972-2004)
సౌందర్య తెలుగు సినీ రంగంలో సావిత్రి అంత గొప్ప నటి అని అన్పించుకుంది. తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళం, హిందీ చిత్రాలలో కూడా నటించి మంచి పేరును సంపాదించుకుంది. ఆమె 2004 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేసింది. అదే సంవత్సరం ఏప్రిల్ 17న బెంగుళూరులోని జక్కూరు విమానాశ్రయం నుంచి మనరాష్ట్రంలోని కరీంనగర్ లో పార్లమెంటు అభ్యర్ధి విద్యాసాగర్ రావు తరపున ప్రచారం చెయ్యడానికి వెళ్లి విమానం కులిపోవటంతో మరణించింది.
4. సిల్క్ స్మిత (1960-1996)
అసలు పేరు విజయలక్ష్మీ ఈమె తెలుగు, తమిళం, కన్నడం మళయాలం, హిందీ భాషలలో నటించింది. స్మిత తన జీవితాంతం అవివాహితగానే ఉండిపోయింది. ఈమె 1996, సెప్టెంబరు 23 న మద్రాసులో ఆమె ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె చావుకు అనేక కారణాలు చెప్పుకొచ్చారు. ప్రేమ విఫలం అయిందని, ఆర్ధిక సమస్యలు కారణమని అనేక రకాల వార్తలు వచ్చాయి. కాని ఆమె చావు ఇప్పటికి మిస్టరీగానే ఉంది.
5. భార్గవి (1983-2008)
టివీ నటిగా పాపులర్ అయిన భార్గవి అష్టాచెమ్మా సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ అకస్మాతుగా అనుమానస్పద స్థితిలో మరణించింది. హైదరాబాదు, బంజారాహిల్స్ లో ఒక అపార్ట్మెంట్ లో తన భర్త బుజ్జితో పాటు మరణించింది. అప్పటి వివరాల ప్రకారం భర్త బుజ్జి ఆమెను చంపి ఆ తరువాత అతడు మరణించాడని వార్తలు వచ్చాయి.
6. ప్రత్యూష (1981-2002)
ప్రత్యూష కేవలం కొన్ని సినిమాల్లో మాత్రమే నటించింది. సముద్రం, స్నేహమంటే ఇదేరా వంటి సినిమాల్లో నటించినా మంచి పేరు సంపాదించింది. ఈమె 2002 పిబ్రవరి 25 రాత్రి 8 గంటలకు హైదరాబాద్ కేర్ ఆసుపత్రి కి సిదార్ధ, ప్రత్యూష ని తీసుకువచ్చి ఇద్దరూ పురుగుల మందు తాగినట్లు చెప్పాడు. వెంటనే డాక్టర్లు చికిత్స మొదలు పెట్టారు. కాని 24 ఉదయం 11 :45 నిమిషాలకు ప్రత్యూష మరణించింది.