Devotional

2019 రాశి ఫలాలు కొత్త సంవత్సరంలో 12 రాశుల వారి భవిష్యత్ ఎలా ఉంటుందో చూద్దాం

2019 రాశి ఫలాలు కొత్త సంవత్సరంలో 12 రాశుల వారి భవిష్యత్ ఎలా ఉంటుందో చూద్దాం

మేష రాశి

మేష రాశివారికి ఆదాయం :14 వ్యయం :14 రాజపూజ్యం : 3 అవమానం : 6
2019 వ సంవత్సరంలో మేష రాశివారు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్ధిక పరిస్థితి చాలా బాగుంటుంది. అయితే ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యాపారాలను ప్రారంభించవచ్చు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం సఫలం అవుతుంది. మీరు లక్ష్యాలను సాధించే క్రమంలో బంధువుల సహకారం లభిస్తుంది.

వృషభ రాశి

ఆదాయం : 8 వ్యయం : 8 రాజపూజ్యం : 6 అవమానం : 6
వృషభరాశి వారు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పురోగతి కనపడుతుంది. అయితే ఆర్ధిక విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వెన్ను నొప్పి బాధించే అవకాశం ఉంది. ఆహారపు అలవాట్ల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. విధ్యార్ధులలో ఉన్నత చదువులకు కొంత ఆటంకం కలిగే అవకాశం ఉంది. ఎంత సంపాదన ఉన్నా ఖర్చులు ఎక్కువగా కనపడతాయి. షేర్ల లావాదేవీల్లో లాభాలు గడిస్తారు. ఉమ్మడి వ్యాపారం లాభాలనిస్తుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

మిధున రాశి
ఆదాయం : 11 వ్యయం : 5 రాజపూజ్యం : 2 అవమానం : 2

వ్యాపారంలో పెట్టుబడి పెట్టె విషయంలో కాస్త ఆలోచించి అడుగు వేయాలి. ఆర్ధిక పరమైన విషయాలలో కాస్త నిదానంగా ఉండటమే మంచిది. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా మొత్తం మీద పురోగతి కనిపిస్తుంది. ఉమ్మడి వ్యాపారం కలిసి వస్తుంది. శుభకార్యాలు . విరోదులపై విజయం సాధిస్తారు. విధ్యార్ధులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళటారు. వ్యాపారం లేదా ఉధ్యోగములో ఉన్న వారైనా ఇంటికి ధురంగా ఉండవలసి వస్తుంది. కెరీర్ లో ముందు అడుగు వేయాలంటే కాస్త కష్టపడాలి. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు రావచ్చు.

కర్కాటక రాశి

ఆదాయం : 5 వ్యయం : 5 రాజపూజ్యం : 5 అవమానం : 2
వ్యాపారంలో మంచి లాభాలు రావటంతో ఆర్ధికంగా బలంగా ఉంటారు. పెద్దల సలహాతో ముందు అడుగు వేస్తె మీకు జీవితంలో విజయం సాధిస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు అన్ని పూర్తి అవుతాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు భుజానికి ఎత్తుకోవాల్సి వస్తుంది. పట్టుదలతో పనిచేసి లక్ష్యాలు సాధిస్తారు. బందు మిత్రుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకు మంచి కాలం. ఈ ఏడాది సంతానం విషయంలో శుభపరిణామాలు సంభ విస్తాయి.

సింహ రాశి

ఆదాయం : 8 వ్యయం : 14 రాజపూజ్యం : 1 అవమానం : 5
ఈ రాశివారు ఈ సంవత్సరం గృహ నిర్మాణాన్ని చేపడతారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. అయితే కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టాలి. ఆర్ధిక పరిస్థితులు కాస్త నిరాశను కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో కొన్ని మనస్పర్ధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతిభకు తగ్గ ఫలితం కలగక కాస్త నిరాశగా ఉంటారు. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోయే ప్రమాదం ఉంది.భారీగా పెట్టుబడులు పెట్టటానికి సరైన సమయం కాదు. రావలసిన బకాయిలు ఆలస్యం అవుతాయి. అందువల్ల ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. . స్థిరస్తుల కొనుగోళ్ళు చేస్తారు.

కన్య రాశి

ఆదాయం : 11 వ్యయం : 5 రాజపూజ్యం : 4 అవమానం : 5
ఈ సంవత్సరం ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపించి ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. శ్రమకు తగిన ఫలితం కనపడుతుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. అయితే స్నేహం కారణంగా చదువుపై అశ్రద్ద పెరిగే అవకాశం ఉంటుంది. కాస్త గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. అందువల్ల వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబం యొక్క మద్దతు లభిస్తుంది. దూరప్రయాణాలకు అనుకూలం ప్రతి పనిలో ఆలస్యం, ఆటంకాలు ఎదురవుతాయి. కాస్త ఓర్పుతో ఉండాలి. కెరీర్ పరంగా విజయాలు వచ్చిన సంతృప్తి ఉండదు.

తుల రాశి

ఆదాయం : 8 వ్యయం : 8 రాజపూజ్యం : 7 అవమానం : 1
ఈ రాశివారికి ఆర్ధికంగా చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకు బదిలీలు,ప్రమోషన్స్ ఉంటాయి. వ్యాపారం బాగుంటుంది. పెట్టుబడులు పెడితే బాగా కలిసి వస్తుంది. ఏ పని చేసిన విజయవంతం అవుతుంది. కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. విద్యార్థులకు చదువు పట్ల కాస్త అశ్రద్ధ పెరుగుతుంది. కాస్త పట్టుదల,కృషి పెడితే విద్యార్థులకు సత్ ఫలితాలు వస్తాయి. ఎప్పటి నుంచో ఉన్న ఆస్థి తగాదాలు అన్ని ఒక కొలిక్కి వస్తాయి. ఇంట్లో, ఆఫీస్ లో బాధ్యతలు అధికంగా ఉంటాయి. కండరాలకు సంబంధించిన సమస్యలు బాధిస్తాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త అవసరం.

వృశ్చిక రాశి

ఆదాయం : 14 వ్యయం : 14 రాజపూజ్యం : 3 అవమానం : 1
ఈ రాశివారికి ఈ సంవత్సరం అన్నిరకాలుగా పురోగతి కనపడుతుంది. ఆకస్మిక ధనాలభం కలగటమే కాకుండా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఆర్ధిక విషయాలలో కాస్త అలోచించి ముందడుగు వేయాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ చూపాలి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కాళ్లు, కండరాలకు సంబంధించిన సమస్యలు బాధిస్తాయి. సంతానం విషయంలో శుభవార్త వింటారు.

ధనస్సు రాశి

ఆదాయం : 2 వ్యయం : 8 రాజపూజ్యం : 6 అవమానం : 1
ఈ సంవత్సరం ఆర్ధికంగా బాగానే ఉన్నా కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు బదిలీలు ఉంటాయి. సృజనాత్మక రంగాల్లో రాణిస్తారు. కొత్త స్నేహాలు ప్రారంభం అవుతాయి. విలాసాలకు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. చేసే ప్రతి పని విశ్వాసంతో చేస్తే విజయవంతం అవుతుంది. పనులలో ఆటంకాలు ఎదురు అయినా దైర్యంగా ముందడుగు వేయాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపాలి. మనస్సు కాస్త చంచలంగా ఉండుట వలన త్వరగా ఏ విషయంలోనూ నిర్ణయానికి రాలేరు. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా కాస్త వెనకపడతారు.

మకర రాశి

ఆదాయం : 5 వ్యయం : 2 రాజపూజ్యం : 2 అవమానం : 4
ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో మంచి సఖ్యత ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. చదువు కోసం విదేశీ యానం చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతలు అధికమవుతాయి. సంతానం విషయంలో అభివృద్ధికి, శుభకార్యాలకు అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్ధిక వ్యవహారాల్లో కొంత నిరుత్సాహంగా ఉండుట వలన అశాంతి కలుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం కలుగుతుంది. కండరాలకు సంబందించిన సమస్యలు వస్తాయి.

కుంభ రాశి

ఆదాయం : 5 వ్యయం : 2 రాజపూజ్యం : 5 అవమానం : 4
వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు ఉండకపోవచ్చు. విలాసాలకు ఖర్చు ఎక్కువగా పెడుతూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల కారణంగా బాధ్యతలు ఎక్కువ అవుతాయి. అధికారం, హోదా, గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో చికాకులు అధికం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వృత్తిపరమైన పనులతో ఒత్తిడికి లోనవుతారు. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓర్పుతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.

మీనా రాశి

ఆదాయం : 2 వ్యయం : 8 రాజపూజ్యం : 1 అవమానం : 7
ఈ సంవత్సరం ఆర్ధిక పరిస్తితి మెరుగు అవుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఉధ్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల సలహాలు, సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. గుండెకు సంబందించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా పనిని ప్రారంభిస్తే అయ్యే వరకు నిద్రపోరు. ఇంటిలో కొన్ని సమస్యలు ఉన్నా ఓర్పుతో బయటపడతారు. విద్యార్థులు కాస్త కృషి చేస్తే ఉన్నత చదువులు చదివే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి శుభ పరిణామాలు ఎదురు అవుతాయి.