అలనాటి నటి వై విజయ గుర్తు ఉందా…ఆమె ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
తల్లిదండ్రులు చిత్రంతో 1970లో 13ఏళ్ళ వయస్సులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వై విజయ మొదట్లో అందాల నటుడు శోభన్ బాబు వంటి అగ్ర హీరోల సరసన చేసింది. ఆతరువాత కేరక్టర్ ఆర్టిస్టుగా మారి, వైవిధ్యమైన అనేక పాత్రలతో ఆడియన్స్ మదిని దోచుకుంది. తెలుగులో చేపల పులుసు అనగానే వై విజయ పాత్ర గుర్తిచ్చేలా ఆమె పాపులర్ అయింది. తెలుగులోనే కాదు,తమిళ,మళయాళ,కన్నడ భాషల్లోనూ ఈమె గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకూ అన్ని భాషల్లో దాదాపు 1000కి పైగా చిత్రాల్లో నటించింది. తల్లిదండ్రులు చిత్రంలో ఆమె పోషించిన పాత్రతో బాగా గుర్తింపు పొందింది. శ్రీకృష్ణ సత్య మూవీలో హీరోయిన్ గా చేసింది.
కర్నూల్ నగరంలో జ్ఞానయ్యా, బాలమ్మ దంపతులకు పుట్టిన వై విజయ పూర్తిపేరు ఎలిగండ్ల విజయ. తండ్రి కో ఆపరేటివ్ సొసైటీలో పనిచేసేవాడు. పదిమంది సంతానంలో ఆమె ఐదవది. చిన్ననాటి నుంచి కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందింది. ఇక తండ్రి ఉద్యోగ రీత్యా అనేక ప్రాంతాలకు బదిలీ అవుతూ చివరకు కడపలో సెటిల్ అయ్యారు. స్టడీస్ అక్కడే జరగడంతో అదే ఆమెకు సొంతూరుగా మారింది. డాన్స్ లో శిక్షణ కోసం వై విజయ కుటుంబం మద్రాసు కు మారింది. ఈమె వెంపటి చినసత్యం దగ్గర శిష్యరికం చేస్తున్న సమయంలో సినిమా ఛాన్స్ వచ్చింది.
తల్లిదండ్రులు చిత్రం తర్వాత విచిత్ర బంధం,మన్మధ లీలలు,ఆడవాళ్ళూ మీకు జోహార్లు,ఆడవాళ్ళు అలిగితే వంటి మూవీస్ తో గుర్తింపు తెచ్చుకుంది.
కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన మా పల్లెలో గోపాలుడు మూవీతో వై విజయ చేపల పులుసు పాత్రతో సొంత ఇమేజ్ తెచ్చుకుంది. ఇక అప్పటినుంచి ఆమెకోసం పాత్రలు పుట్టుకొచ్చాయి. మంగమ్మగారి మనవడు,స్వాతిముత్యం,లేడీస్ టైలర్,శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్,ఏప్రియల్1 విడుదల వంటి చిత్రాలు వై విజయ నటన కు అద్దం పట్టాయి.
కాగా మద్రాస్ సెయింట్ జోసెఫ్ కాలేజీ ప్రిన్సిపాల్ అమరనాధన్ ని లవ్ మేరేజ్ చేసుకున్న వై విజయకు ఒక కుమార్తె వుంది. అమరనాధన్ ప్రిన్సిపాల్ గా రిటైరయ్యాక వ్యాపార రంగంలోకి ప్రవేశించాడు. ఇక కూతురికి 2013లో ఘనంగా పెళ్లి చేసారు. ఇక తెలుగు,తమిళ సీరియల్స్ లో కూడా వై విజయ బిజీ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది.